AI-Driven Fighter Jet | యుద్ధ విమానాలను నడిపే సరికొత్త కృత్రిమ మేధస్సు సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో AIటెక్నాలజీ అనేక రంగాలను ప్రభావితం చేస్తోంది. ప్రస్తుతం యుద్ద విమానాన్నికూడా నడిపే(AI-Driven Fighter Jet) స్థాయికి చేరుకుంది. By Lok Prakash 04 May 2024 in ఇంటర్నేషనల్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో AIటెక్నాలజీ అనేక రంగాలను ప్రభావితం చేస్తోంది. ప్రస్తుతం యుద్ద విమానాన్నికూడా నడిపే(AI-Driven Fighter Jet) స్థాయికి చేరుకుంది. భవిష్యత్ యుద్దాల్లో ఎదురయ్యే సవాళ్లకు అనుగుణంగా.. ఏఐ సాంకేతికతను అభివృద్ది చేసుకుంటున్న అమెరికా.. యుద్ద విమానాన్ని నడిపే బాధ్యతను ఏఐకి అప్పగించింది. ఈ టాస్క్ ను AI సమర్థవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రయోగాన్ని కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్‌బేస్‌లో చేపట్టారు. ఏఐ నడుపుతున్న ఎఫ్-16 యుద్ధ విమానంలో ఏకంగా ఎయిర్ ఫోర్స్ సెక్రటరీ కూడా ప్రయాణించాడు. శత్రువిమానాలపై, పైచేయి సాధించేందుకు చేపట్టిన పలు గగనతల విన్యాసాల్లో. AI విమానం సాధారణ పైలట్ విమానానికి గట్టి పోటీ ఇచ్చింది. ఈ సాంకేతికత ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉన్నప్పటికీ.. ఏఐకి సంబంధించి అమెరికా ఎయిర్‌ఫోర్స్ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మొత్తం 1000 మానవరహిత, ఏఐ యుద్ధవిమానాల ఏర్పాటే లక్ష్యంగా అమెరికా ముందడుగు వేస్తోంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి