సీన్ రివర్స్.. జీన్స్ వేసుకోవాలని అత్త.. చీరనే కడతానని కోడలు ఫైటింగ్..!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో అత్తాకోడళ్ల మధ్య విచిత్ర పంచాయితీ జరిగింది. జీన్సే ధరించాలని అత్త పట్టుబడితే.. కోడలు మాత్రం చీరనే కడుతానంటూ తెగేసి చెప్పింది. ఈ పంచాయితీ కాస్తా ముదిరి పోలీస్ స్టేషన్‌కు చేరింది.

New Update
సీన్ రివర్స్.. జీన్స్ వేసుకోవాలని అత్త.. చీరనే కడతానని కోడలు ఫైటింగ్..!

Agra, 21 November: అత్తా కోడళ్ల మధ్య ఏదో ఒక అంశంపై నిత్యం గొడవలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో భౌతిక దాడులకు దిగిన ఘటనలు కూడా ఉంటాయి. అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే పంచాయితీ మాత్రం చాలా విచిత్రమైంది. మోడ్రన్ అత్తకు.. సంప్రదాయ బద్ధమైన కోడలికి మధ్య జరిగిన ఈ పంచాయితీ.. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. ఇంతకీ ఏం జరిగిందో ఓసారి తెలుసుకుందాం..

యూపీలోని ఆగ్రాకు చెందిన అత్తాకోడళ్ల మధ్య దుస్తుల విషయంలో నిత్యం గొడవ జరుగుతోంది. అత్తకు జీన్స్ అంటే ఇష్టం.. ఆమె జీన్స్ మాత్రమే ధరిస్తుంది. అంతేకాదు.. తన కోడలిని కూడా అవే డ్రెస్సులు వేసుకోవాలంటూ ఒత్తిడి చేస్తోంది. అయితే, కోడలు మాత్రం అత్త చెప్పిన మాటను వినడం లేదు. తనకు చీర కట్టుకోవడమే చాలా ఇష్టమని, చీర మాత్రమే కట్టుకుంటానంటూ తెగేసి చెబుతోంది. తన మాటను అత్త వినడం లేదంటూ వాపోతోంది.

ఇద్దరి మధ్య పంచాయితీ రోజు రోజుకు మరింత ముదరడంతో ఇక లాభం లేదనుకున్న కోడలు.. పోలీస్ స్టేషన్ గడప తొక్కింది. తన అత్తపై ఆగ్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన అత్త తనను జీన్స్ వేసుకోవాలంటూ బలవంతం చేస్తోందని, చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొంది. 'నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను. నాకు చీరలు ధరించడమంటేనే ఇష్టం. జీన్స్ వేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఈ విషయంలో అత్తింట్లో వేధింపులు ఎక్కువయ్యాయి. అత్త నా మాట వినడం లేదు. భర్తకు చెబితే.. తిరిగి నన్నే కొడుతున్నాడు.' అని కోడలు తన ఫిర్యాదులో పేర్కొంది. పరిస్థితిని అర్థం చేసుకున్న పోలీసులు.. వారికి కౌన్సిలింగ్ ఇస్తామని చెబుతున్నారు. సమస్యను పరిష్కరిస్తామంటున్నారు.

Also Read:

నిరుద్యోగులకు కేటీఆర్ సంచలన హామీ.. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే..

ఆ ఒక్కడికీ తప్ప అందరికీ రెస్ట్.. ఆసిస్ తో టీ20 సిరీస్ కెప్టెన్ గా సూర్య!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pawan Kalyan: పవన్ కొడుకు కోలుకోవాలని జనసైనికుల పూజలు,

పిఠాపురంలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని పూజలు నిర్వహిస్తున్నారు. పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో జనసైనికులు, వీరమహిళలు మృత్యుంజయ హోమం జరిపించారు. మార్క్ సంపూర్ణ ఆరోగ్య వంతులుగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. 

New Update
Special prayers for pawan son mark

Special prayers for pawan son mark

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ లోని స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులు పవన్ కొడుకు త్వరగా కోలుకోవాలంటూ తమ విషెష్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో జనసైనికులు పవన్ కుమారుడి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో మృత్యుంజయ హోమం జరిపించారు. అలాగే తాడిపత్రి అపర్ణాదేవి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జనసైనికులు మీడియాతో మాట్లాడుతూ.. పవన్ చేసిన మంచే ఆయన కొడుకుకు తిరిగి వచ్చిందని అన్నారు. ఏపీలో పవన్  భవన నిర్మాణ కార్మికులకు చేసిన మేలు.. అదే భవన నిర్మాణ కార్మికుల చేత తన కొడుకును రక్షించేలా చేసిందని తెలిపారు. 

హెల్త్ అప్డేట్ 

ఇదిలా ఉంటే.. మార్క్ శంకర్ ప్రస్తుతం సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా పవన్ టీమ్  మార్క్ ఆరోగ్యంపై అప్‌డేట్ విడుదల చేసింది.  అగ్ని ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ ప్రస్తుతం కోలుకుంటున్నట్లు తెలిపారు. ఎమర్జెన్సీ వార్డు నుంచి బయటకు మార్చినట్లు పవన్ కళ్యాణ్ టీమ్ వెల్లడించింది. మరో మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షనలో ఉంచాలని సూచించినట్లు తెలిపారు. స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ చేతికి, కాలికి గాయాలవడంతో పాటు ఉపిరితిత్తులోకి పొగ చేరింది. 

telugu-news | latest-news | pawan kalyan son | pawan kalyan son accident

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు