28 ఏళ్ల తరువాత విశ్వ సుందరి పోటీలకు ఆతిధ్యం ఇవ్వనున్న భారత్

71వ ప్రపంచ సుందరి పోటీలకు భారత్ వేదిక కానుంది.ఢిల్లీ , ముంబై వేదికగా ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు మిస్ వరల్డ్ పోటీలు జగనున్నాయని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్పర్సన్, సీఈఓ జూలియా మోర్లే ఆఫీషియల్ ‘ఎక్స్' ట్విట్టర్ ద్వారా వెల్లడించారు

New Update
28 ఏళ్ల తరువాత విశ్వ సుందరి పోటీలకు  ఆతిధ్యం ఇవ్వనున్న భారత్

Miss World 2024 : 71వ ప్రపంచ సుందరి పోటీలకు భారత్ వేదిక కానుంది.ఢిల్లీ , ముంబై వేదికగా ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు మిస్ వరల్డ్ పోటీలు జగనున్నాయని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్పర్సన్, సీఈఓ జూలియా మోర్లే (Julia Morley)ఆఫీషియల్ ‘ఎక్స్' ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ వేడుకలు ఢిల్లీలోని భారత్ మండపం, ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించనున్నారు. ఫైనల్స్ ముంబయిలో జరగనున్నాయని అధికారికంగా వెల్లడించారు. మిస్ వరల్డ్ ఆతిథ్య దేశంగా భారతన్ ను ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉందని, అందం, వైవిధ్యం, సాధికారత కలగలిపిన ఈ అద్భుత వేడుకను ఆస్వాదించేందుకు సిద్ధమవ్వండని ట్విట్టర్ లో రాసుకొచ్చారు.1996లో చివరి సారి బెంగళూరు లో ఈ పోటీలను నిర్వహించగా మళ్ళీ 28 ఏళ్ల తరువాత భారత్ ఆతిధ్యం ఇవ్వబోతుండటంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.


మిస్ వరల్డ్ కిరీటాన్ని భారత్ నుంచి కైవసం చేసుకున్న అందగత్తెలు వీళ్ళే
1966లో   రీటా ఫారియా

1994లో ఐశ్వర్యరాయ్ బచ్చన్

1997లో డయానా హేడెన్

1999లో యుక్తా ముఖీ

2000లో ప్రియాంక చోప్రా

2017లో మానుషి చిల్లర్

భారత దేశంలోని విలువలు, భిన్నత్వంలో ఏకత్వం, గౌరవం, ప్రేమ, దయ, ఇవన్నీ ఈ వేడుక ద్వారా యావత్ ప్రపంచానికి చాటి చెప్పాలనే ఈ వేడుక ఉద్దేశ్యమని  మోర్లే వెల్లడించారు. అంతవరకు మన దేశంలో సంప్రదాయ అందాల పోటీలకు ప్రాధాన్యత ఉండేది. వీటన్నిటికీ అతీతంగా మొట్టమొదటిసారి ప్రపంచ సుందరి వేడుకను 1951లో నిర్వహించడం విశేషం.

ప్రపంచ సుందరి అంటే అందానికే ప్రాముఖ్యత నిస్తారా ?

చాలా మందికి మిస్ వరల్డ్ అంటే అందగత్తెలు మాత్రమే అనుకుంటారు. కానీ .. అందుకు బిన్నంగా ఈ పోటీలు నిర్వహించడం విశేషం.మిస్ వరల్డ్ అంటే అందంతో పాటు సేవా కార్యక్రమాలతో సమాజంలో మంచి మార్పులు తీసుకొచ్చే కెపాసిటీ , నాలెడ్జ్ మెండుగా ఉన్నవారికె ఈ కిరీటం వరిస్తుంది.ఈ పోటీల ప్రధాన ఉద్దేశ్యం అదే. మార్చి 9తో ముగియనున్న ఈ పోటీలు అదే రోజు రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు లైవ్ ప్రసారాల్లో ప్రజలంతా వీక్షించేందుకు వీలవుతుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు