National: 225 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు.. నివేదిక విడుద‌ల చేసిన ఏడీఆర్!

లోక్‌స‌భ‌లోని 514 మంది ఎంపీల్లో 225 మందిపై క్రిమిన‌ల్ కేసులున్నట్లు అసోసియేష‌న్ ఫ‌ర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ADR) నివేదిక విడుదల చేసింది. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ల ఆధారంగా ఏడీఆర్ ప‌లు వివ‌రాలను బయటపెట్టింది.

New Update
National: 225 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు.. నివేదిక విడుద‌ల చేసిన ఏడీఆర్!

ADR: అసోసియేష‌న్ ఫ‌ర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ADR) సంచలన నివేదిక విడుదల చేసింది. లోక్‌స‌భ‌లోని 514 మంది సిట్టింగ్ ఎంపీల్లో 225 మందిపై క్రిమిన‌ల్ కేసులున్నట్లు తెలిపింది. ఈ మేరకు 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ల ఆధారంగా ఏడీఆర్ ప‌లు వివ‌రాలను బయటపెట్టింది.

మ‌త విద్వేషాల‌ను రెచ్చగొట్టడం, అప‌హ‌ర‌ణ‌..
క్రిమిన‌ల్ కేసులున్న 29 శాతం మంది మ‌త విద్వేషాల‌ను రెచ్చగొట్టడం, అప‌హ‌ర‌ణ‌, మ‌హిళ‌ల‌పై నేరాలు, హ‌త్య, హ‌త్యాయ‌త్నం వంటి కేసులున్నట్లు వెల్లడైంది. మొత్తం 9 మందిపై హ‌త్య కేసులు న‌మోదు కాగా, వీరిలో 5మంది బీజేపీ నాయకులే కావాడం విశేషం. కాగా 28 మందిపై హ‌త్యాయ‌త్నం కేసులు న‌మోదు కాగా, వీరిలో 21 మంది బీజేపీకి చెందిన వారే ఉన్నారు. మ‌హిళ‌ల‌పై నేరాలకు సంబంధించి 16 కేసులు, 3 అత్యాచారం కేసులు న‌మోదైనట్లు వెల్లడైంది.

ఇది కూడా చదవండి: Shimla: కీచక ఫ్రొఫెసర్.. యూనివర్సిటీ విద్యార్థినిపై దారుణం!

5 శాతం మంది కోటీశ్వరులు..
ఇక మొత్తం ఎంపీల్లో 5 శాతం మంది కోటీశ్వరులుండగా.. ఒక్కొక్కరి సంప‌ద రూ.100 కోట్లకు పైగానే ఉన్నట్లు బయటపడ్డాయి. అత్యంత ధ‌నిక ఎంపీల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన న‌కుల్ నాథ్ మొదటి స్థానంలో ఉన్నారు. త‌ర్వాతి స్థానాల్లో డీకే సురేశ్‌(కాంగ్రెస్), ర‌ఘురామ‌కృష్ణ రాజు ఉన్నారు. 73 శాతం మంది ఎంపీలు గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసినట్లు వెల్లడైంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు