Adireddy Vasu: కల్చరల్ హబ్ గా ఉండాల్సిన రాజమండ్రి ఇలా మారింది: ఆదిరెడ్డి వాసు

కూటమి ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ మేనిఫెస్టో విజయవంతంగా ముందుకు వెళ్తుందన్నారు రాజమండ్రి సిటీ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు. వైసీపీ పాలనలో కల్చరల్ హబ్ గా ఉండాల్సిన రాజమండ్రి క్రైమ్ హబ్ గా మారిందని విమర్శలు గుప్పించారు.

New Update
Adireddy Vasu:  కల్చరల్ హబ్ గా ఉండాల్సిన రాజమండ్రి ఇలా మారింది: ఆదిరెడ్డి వాసు

Adireddy Vasu: కూటమి ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ మేనిఫెస్టో విజయవంతంగా ముందుకు వెళుతుందని అన్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సిటీ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు. రాజమండ్రి సిటీకి సంబంధించిన మేనిఫెస్టోను ప్రజల ముందుకు తీసుకువచ్చామన్నారు. గౌతమి ఘాట్, సరస్వతి ఘాట్, పుష్కర ఘాట్లను అనుసంధానం చేస్తూ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి కృషి చేస్తామని కామెంట్స్ చేశారు.

Also Read: భూమి కింద మరో మహా సముద్రం ఉంది..సైంటిఫిక్ డిస్కవరీలో బయటపడిన నిజాలు

రాజమండ్రి నుంచి టూరిజం హబ్ చేస్తామని..రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే క్రీడాకారులకు స్కాలర్షిప్లు ఇస్తామని వెల్లడించారు. మెగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టి ప్రధాన క్రీడలకు కోచింగ్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. నేరాల నియంత్రణ కోసం రాజమండ్రి రక్షణ దళం ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు.ఎమర్జెన్సీ కాల్ బాక్స్ లను ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేస్తామన్నారు.


Also Read: ఆమ్‌ ఆద్మీ పార్టీని కుదిపేస్తోన్న ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌..!

ఆరోగ్యానికి సంబంధించి రాష్ట్రంలోనే తొలిసారిగా హెల్త్ ఏటీఎంలను దశలవారీగా ఏర్పాటు చేస్తామని వివరించారు. నగరాన్ని మలేరియా డెంగ్యూ రహితంగా తీర్చిదిద్దుతామన్నారు. రాజమండ్రిలో ఐటీ స్టార్టప్ కంపెనీ ఏర్పాటుకు అనుకూలంగా ఇంక్యూ బేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్థానిక కంపెనీలో యువతకు ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ కల్పిస్తామని వెల్లడించారు. వైసీపీ పాలనలో కల్చరల్ హబ్ గా ఉండాల్సిన రాజమండ్రీ క్రైమ్ హబ్ గా మారిందని విమర్శలు గుప్పించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు