Vishaka: ఓటింగ్ పై అవగాహన కార్యక్రమం..!

విశాఖలో అడిషనల్ రిటర్నింగ్ అధికారి విజయలక్ష్మి ఓటింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం మన బాధ్యతని ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు . 18 ఏళ్ల పైబడిన వారంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

New Update
Vishaka: ఓటింగ్ పై అవగాహన  కార్యక్రమం..!

Vishaka: విశాఖలో అడిషనల్ రిటర్నింగ్ అధికారి విజయలక్ష్మి ఓటింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  కులం, మతం, అనే బేధం లేకుండా రాజ్యాంగం భారతీయులందరికీ ఓటు హక్కుని కల్పించిందని అడిషనల్ రిటర్నింగ్ అధికారి విజయలక్ష్మి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఎం విపి రైతు బజారులో ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ.. స్వీప్ కార్యక్రమాన్ని నగరంలో పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి నిర్వహించారు.

Also read: తిరుపతి ప్రజలకు బిగ్ రిలీఫ్.. ఒక్కసారిగా దంచికొట్టిన వర్షం..!

ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం మన బాధ్యతగా ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. 18 ఏళ్ల పైబడిన వారంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు . ఆశించే మార్పు రావాలంటే శాసించే మీరంతా ఓటు వేయాలని కోరారు. మనకు ఇష్టమైన నాయకులు పోటీలో లేకుంటే "నోటా" బటన్ నొక్కి పైన ఉన్న వారెవరూ కాదు అని ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని వివరించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు