Adani Coal Case: అదానీకి మరో షాక్.. ఆ కేసు విచారణ తిరిగి ప్రారంభించనున్న డీఆర్ఐ అదానీ గ్రూప్ బొగ్గు దిగుమతి కేసులో విచారణ తిరిగి ప్రారంభించడానికి డీఆర్ఐ సన్నాహాలు చేస్తోంది. దీనికోసం సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసింది. 2016 నుంచి సింగపూర్ లో కంపెనీ జరిపిన లావాదేవీలకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించడానికి ప్రయత్నిస్తోంది. By KVD Varma 17 Nov 2023 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి Adani Coal Case: అదానీ గ్రూప్ నకు సంబంధించిన బొగ్గు దిగుమతి కేసులో విచారణను పునఃప్రారంభించేందుకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను సింగపూర్ నుంచి సేకరించేందుకు అనుమతించాలని డీఆర్ఐ పేర్కొంది. అమెరికన్ వార్తా సంస్థ రాయిటర్స్ తన రిపోర్ట్ లో ఈ విషయాన్ని తెలియజేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం, దర్యాప్తు సంస్థ సింగపూర్ అధికారుల నుంచి అదానీ గ్రూప్ 2016 సంవత్సరం నుంచీ.. లావాదేవీలకు సంబంధించిన పత్రాలను పొందాలనుకుంటోంది. సింగపూర్‌కు చెందిన అదానీ గ్లోబల్ పీటీఈ ద్వారా ఇండోనేషియా సరఫరాదారు నుంచి దిగుమతి చేసుకున్న అనేక బొగ్గు సరుకుల కోసం గ్రూపునకు అధిక బిల్లులు వచ్చినట్లు DRI విశ్వసిస్తోంది. న్యాయ ప్రక్రియ ద్వారా సింగపూర్, భారత్‌లో ఈ కేసుకు సంబంధించిన పత్రాలు బయటికి రాకుండా చేయడంలో గౌతమ్ అదానీ కంపెనీలు విజయం సాధించాయని కోర్టు పత్రాలు చెబుతున్నాయి. అసలు విషయం ఏంటంటే... అదానీ గ్రూప్ ఇండోనేషియా నుంచి తక్కువ ధరకు బొగ్గును దిగుమతి చేసిందని, బిల్లును రిగ్గింగ్ చేసి ఎక్కువ ధరలను చూపిందని ఫైనాన్షియల్ టైమ్స్ తన నివేదికలు ఒకదానిలో ఆరోపించింది. దీంతో బొగ్గుతో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను సదరు గ్రూపు వినియోగదారులకు ఎక్కువ ధరకు విక్రయించింది. 2019 - 2021 మధ్య 32 నెలల్లో అదానీ గ్రూప్ ద్వారా ఇండోనేషియా నుంచి భారతదేశానికి దిగుమతి చేసుకున్న 30 బొగ్గు సప్లై కన్ సైన్మెంట్స్ వారు పరిశోధించారని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. ఈ అన్ని సరుకుల దిగుమతి రికార్డులలో, ఎగుమతి ప్రకటన కంటే ధరలు ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. దిగుమతి సమయంలో కలిపి షిప్మెంట్ల విలువ $70 మిలియన్లకు పైగాఅంటే సుమారు ₹582 కోట్లు పెరిగింది. Also Read: ముంబై ఎయిర్ పోర్ట్ కొత్త రికార్డ్.. ఏమిటంటే.. 2014లో ఈ కేసును దర్యాప్తు ప్రారంభం.. నివేదిక ప్రకారం, DRI 2014లో ఈ కేసును దర్యాప్తు చేయడం ప్రారంభించింది. ఇందులో 40 కంపెనీలు పాల్గొన్నాయి. ఇండోనేషియా బొగ్గును దిగుమతి చేసుకునే కంపెనీలు సింగపూర్‌తో సహా చోట్ల మధ్యవర్తుల ద్వారా పంపిన షిప్మెంట్ బిల్లులను చూపించి డెలివరీలపై అధికంగా వసూలు చేస్తున్నాయని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. దర్యాప్తు అధికారులు అదానీ గ్రూప్ కంపెనీలకు(Adani Coal Case) చెందిన 1300 షిప్మెంట్లను సమీక్షించారు మరియు ఇండోనేషియా నుంచి ఎగుమతి చేయడం కంటే దిగుమతి చేసుకునేటప్పుడు బొగ్గు ధరను పెంచారని ఆరోపించారు. దేశంలో విద్యుత్‌ను ఖరీదైన ధరకు అమ్మి సొమ్ము చేసుకోవడమే దీని వెనుక లక్ష్యం. విచారణపై బాంబే హైకోర్టు స్టే.. అదానీ గ్రూప్ సవాలుపై, విధానపరమైన లోపాలను పేర్కొంటూ దానికి వ్యతిరేకంగా సాక్ష్యాలను సేకరించాలన్న అభ్యర్థనను 2019లో బాంబే హైకోర్టు తిరస్కరించింది. కొన్ని రోజుల తర్వాత, ఈ సంస్థ దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా, సుప్రీంకోర్టు హైకోర్టు నిర్ణయాన్ని నిలిపివేసి దర్యాప్తును అనుమతించింది. దీని తర్వాత, 2020లో, అదానీ గ్రూప్ డిమాండ్‌పై, భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తుది నిర్ణయానికి రానందున దీనికి సంబంధించిన పత్రాలను ఇంకా విడుదల చేయవద్దని సింగపూర్ కోర్టు తెలిపింది. అదానీ గ్రూప్ ఆరోపణలన్నింటినీ తోసిపుచ్చింది. బొగ్గు ధరలో(Adani Coal Case) అవకతవకలకు సంబంధించిన ఆరోపణలన్నింటినీ అదానీ గ్రూప్ తోసిపుచ్చింది. ఫైనాన్షియల్ టైమ్స్ కథనం పాత - నిరాధారమైన ఆరోపణలపై ఆధారపడి ఉందని గ్రూప్ పేర్కొంది. ఇది పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న వాస్తవాలు - సమాచారాన్ని రీసైక్లింగ్ చేయడం అని చెప్పింది. Watch this interesting video: #adani-group #coal-case మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి