Shruti Haasan : అలాంటి పేర్లతో పిలిస్తే అస్సలు ఊరుకోను.. నెటిజన్ పై శృతి హాసన్ ఫైర్!

శృతి హాసన్ తాజాగా ఓ నెటిజన్ పై విరుచుకుపడింది. సౌత్‌ ఇండియన్‌ యాసలో ఏదైనా చెప్పవా? అని ఓ నెటిజన్‌ అడిగాడు. దీనికి హీరోయిన్ బదులిస్తూ..'జాతివివక్షను నేను అస్సలు సహించను. మమ్మల్ని చూసి ఇడ్లీ, దోస, సాంబార్‌.. ఇలాంటి పేర్లతో పిలిస్తే మేము ఊరుకోలేము' అని చెప్పింది.

New Update
Shruti Haasan : అలాంటి పేర్లతో పిలిస్తే అస్సలు ఊరుకోను.. నెటిజన్ పై శృతి హాసన్ ఫైర్!

Actress Shruti Haasan Fires On Netizen : కోలీవుడ్ బ్యూటీ శృతి హాసన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాల పరంగా వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ఈ హీరోయిన్ సమయం దొరికినప్పుడల్లా అభిమానులతో సిట్ చాట్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గానే తనకు బ్రేకప్ అయిన విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకోవడమే కాకుండా తాను ప్రెజెంట్ సింగిల్ గానే ఉన్నానని చెప్పింది. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసిన శృతి హాసన్ ఓ నెటిజన్ పై విరుచుకుపడింది.

అస్సలు సహించను...

సౌత్‌ ఇండియన్‌ యాసలో ఏదైనా చెప్పవా? అని ఓ నెటిజన్‌ అడగ్గా.. అందుకు శృతి ఇలా రియాక్ట్‌ అయింది. ఓకే.. ఈ రకమైన జాతివివక్షను నేను అస్సలు సహించను. మమ్మల్ని చూసి ఇడ్లీ, దోస, సాంబార్‌.. ఇలాంటి పేర్లతో పిలిస్తే మేము ఊరుకోలేము. మీరు మమ్మల్ని అనుకరించలేరు.. కాబట్టి మాలాగా ఉండాలని ట్రై చేయకండి.. ఎలా పడితే అలా పిలిస్తే దాన్ని కామెడీగా తీసుకోము.

publive-image

Also Read : ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ‘కల్కి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్?

సౌత్‌ ఇండియన్‌ భాషలో ఏదైనా చెప్పమేని అడిగావు కదా.. నోరు మూసుకుని వెళ్లు అని తమిళంలో రాసుకొచ్చింది. దీంతో శృతి హాసన్ పెట్టిన ఈ రిప్లై నెట్టింట వైరల్ అవుతుంది. కాగా శృతి హాసన్ కెరీర్ పరంగా జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. గత ఏడాది ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’, ‘సలార్’ వంటి సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకుంది. ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు