Shruti Haasan : వామ్మో.. శృతి హాసన్ ఇంతమందితో ఎఫైర్ నడిపిందా?

శృతి హాసన్ గత కొన్నేళ్లుగా డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో రిలేషన్ షిప్ మైంటైన్ చేసింది. ఇక రీసెంట్ గానే అతనికి బ్రేకప్ చెప్పింది. ఇతని కంటే ముందు సిద్ధార్థ్, ధనుష్, నాగ చైతన్య, క్రికెటర్ సురేష్ రైనా వంటి వారితో ప్రేమలో పడిందనే వార్తలు వినిపించాయి.

New Update
Shruti Haasan : వామ్మో.. శృతి హాసన్ ఇంతమందితో ఎఫైర్ నడిపిందా?

Actress Shruti Haasan : యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూతురిగా సినీ ఆరంగేట్రం చేసిన శృతి హాసన్ తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో నటించి హీరోయిన్ గా భారీ గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోలందరితో నటించి స్టార్ ఇమేజ్ ని కైవసం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రెజెంట్ తన సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ వరుస విజయాలతో దూసుకుపోతుంది.

ఇక శృతి హాసన్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. గత కొన్నేళ్లుగా డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో రిలేషన్ షిప్ మైంటైన్ చేసింది. ఇక రీసెంట్ గానే అతనికి బ్రేకప్ చెప్పింది. ఇదిలా ఉంటే శాంతను కంటే ముందు పలువురితో శృతి హాసన్ రిలేషన్ షిప్ మైంటైన్ చేసిందట. ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

తమిళంలో 3 మూవీ చేస్తున్న సమయంలో ధనుష్, శ్రుతిహాసన్ మధ్య ఎఫైర్ నడిచిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ సినిమా సమయంలో వీళ్లిద్దరూ సీక్రెట్ గా రిలేషన్ మైంటైన్ చేశారట. ఆ తర్వాత హీరో సిద్దార్థ్ తో కూడా డేటింగ్ చేసినట్లు న్యూస్ వచ్చింది. ఇతని తర్వాత క్రికెటర్ సురేష్ రైనాతో కూడా కొన్నేళ్లు ప్రేమాయణం నడిపినట్లు ప్రచారం జరిగింది.

ఇక టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్న సమయంలో నాగ చైతన్య ను ప్రేమించింది. వీళ్లిద్దరు కలిసి ప్రేమమ్ సినిమాలో నటించారు. ఈ మూవీ షూటింగ్ టైం లోనే ప్రేమించుకున్నారని, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకోగా.. నాగార్జున నో చెప్పడంతో చైతూ డ్రాప్ అయినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి.

ఆ తర్వాత కొన్నాళ్లకు మైఖేల్ కొసలే అనే వ్యక్తితో శ్రుతి హాసన్ డేటింగ్ చేసింది. పెళ్లికి ముందే ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో కాపురం కూడా పెట్టారు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి రిలేషన్‌షిప్‌‌కు 2019లో తెరపడింది. విభేదాలు తలెత్తడంతో మైఖేల్ కొసలే‌కు శ్రుతి హాసన్ బ్రేకప్ చెప్పేసింది. ఇక ఇతని తర్వాత శాంతను హాజరికాతో రెండేళ్లు డేటింగ్ చేసి.. ఇటీవలే అతనికి బ్రేకప్ చెప్పింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు