Suvarna Sundari: ఓటీటీలో సువర్ణ సుందరి... ఏడాది తర్వాత స్ట్రీమింగ్

నటి జయప్రద, పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'సువర్ణ సుందరి'. గతేడాది ఫిబ్రవరి 3న విడుదలైన ఈ సినిమా.. సుమారు ఏడాది తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది.

New Update
Suvarna Sundari: ఓటీటీలో సువర్ణ సుందరి... ఏడాది తర్వాత స్ట్రీమింగ్

Suvarna Sundari : సురేంద్ర మాదారపు(Surendra Madhavarapu) దర్శకత్వంలో సీనియర్ నటి జయప్రద(Jaya Prada), పూర్ణ(Poorna) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'సువర్ణ సుందరి'(Suvarna Sundari). గతేడాది ఫిబ్రవరి 3న సూపర్ నేచురల్ సోషియో ఫ్యాంటసీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన వసూళ్లను రాబట్టలేకపోయింది. జయప్రద, సాయి కుమార్, కోటశ్రీనివాస్, ఇంద్ర, నాగినీడు, లాంటీ భారీ కాస్టింగ్ ఉన్నప్పటికీ కథ పరంగా యావరేజ్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా.

Also Read : Operation Valentine: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న ఆపరేషన్ వాలెంటైన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

ఓటీటీలో సువర్ణ సుందరి స్ట్రీమింగ్

అయితే  థియేటర్స్ లో యావరేజ్ టాక్ తో సరిపెట్టుకున్న ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీ(OTT Streaming) ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. విడుదలైన ఏడాది తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది.  ప్రస్తుతం సువర్ణ సుందరి సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో(Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. నేటి నుంచి ఈ సినిమాను చూడవచ్చు.

Suvarna Sundari

రూ.79 రెంటల్ పద్దతిలో

అయితే ఈ మూవీ రెంటల్ పద్దతిలో స్ట్రీమింగ్ కు వచ్చింది. రూ.79 చెల్లించి ఈ సినిమాను వీక్షించవచ్చు. త్వరలోనే ప్రైమ్ వీడియో సబ్‍స్క్రైబర్స్ అందరికీ ఫ్రీ స్ట్రీమింగ్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే రెంటల్ పద్ధతిలో అందుబాటులోకి వచ్చింది.

Also Read : Kiran Abbavaram: తన మొదటి సినిమా హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న కిరణ్ అబ్బవరం..! 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Urvashi Rautela: దబిడి దిబిడి భామకు గోల్డెన్ క్వీన్‌ అవార్డు..

"డాకు మహారాజ్" చిత్రంలో తన నటనకు గానూ బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలాకు ఫ్యాన్స్ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు దక్కింది. అవార్డును పట్టుకున్న ఫోటోలను షేర్ చేస్తూ తనకు సప్పోర్ట్ చేసిన అభిమానులందరికి ధన్యవాదాలు తెలిపారు ఊర్వశి.

New Update
Urvashi Rautela Award

Urvashi Rautela Award

Urvashi Rautela: బాలయ్య బాబుతో కలిసి డాకు మహారాజ్ లో దబిడి దిబిడి అంటూ స్టెప్పులేసిన బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా కష్టానికి గుర్తింపు లభించింది. ఫ్యాన్స్ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు (గోల్డెన్ క్వీన్ అవార్డు) తన ఖాతాలో వేసుకుంది ఈ హాట్ బ్యూటీ. అయితే డాకు మహారాజ్ లో బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో నటించి మెప్పించిన ఊర్వశి "దబిడి దిబిడి" పాటతో తెలుగు ఆడియన్స్ లో  ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకుంది. అయితే, ఈ పాటపై కొంతమంది విమర్శలు చేసినా, ఊర్వశి పెర్ఫార్మన్స్ మాత్రం ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది.

Also Read: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో

Also Read: Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు

గోల్డెన్ క్వీన్ అవార్డు..

అయితే, ఫ్యాన్స్ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును  అందుకున్న ఊర్వశి ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. "డాకు మహారాజ్" చిత్రంలో తన నటనకు గానూ ఈ అవార్డును అందుకున్నట్టు ఈ విషయాన్నీ ఫ్యాన్స్ తో  సోషల్ మీడియా ద్వారా  పంచుకోవడం ఆనందంగా ఉంది" అని ఊర్వశి తెలిపింది, అవార్డును పట్టుకున్న ఫోటోలను షేర్ చేస్తూ తనకు సప్పోర్ట్ చేసిన  అభిమానులందరికి  ధన్యవాదాలు తెలిపారు. 

Also Read: ‘అదిదా సర్‌ప్రైజ్‌’ ఫుల్ వీడియో సాంగ్.. సైలెంట్​గా స్టెప్ లేపేసారుగా..!

Also Read: NTR: ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్.. పవన్ కొడుకు కోసం ఎన్టీఆర్ ట్వీట్

Advertisment
Advertisment
Advertisment