/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-02T153946.019.jpg)
Rakshana Trailer: ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఫుల్ క్రేజ్ దక్కించుకున్న పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) రీసెంట్ గా 'మంగళవారం' మూవీతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది. సైకలాజికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. దీంతో ఈ పంజాబీ ముద్దు గుమ్మా మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. వాటిలో ఒకటి రక్షణ.
రక్షణ
పవర్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పాయల్ నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ 'రక్షణ'. హరిప్రియ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రణదీప్ ఠాకోర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రకాశ్ జోసెఫ్, రమేశ్‌రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఆసక్తికరంగా సాగింది ట్రైలర్.
రక్షణ ట్రైలర్
నిజాయితీ గల ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్‌గా పాయల్ బాధ్యతలను చేపడుతుంది పాయల్. ఆమె బాధ్యతలు చేపట్టిన ప్రాంతాన్ని జీరో క్రైమ్ సిటీగా మార్చాలనేది ఆమె లక్ష్యంగా చూపించారు. కానీ డిపార్ట్మెంట్ నుంచి ఆమెకు సపోర్ట్ ఉండదు. ఇక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా సిటీలో జరుగుతున్న క్రైమ్స్ మిస్టరీని పాయల్ ఎలా ఛేదిస్తుంది..? ఈ క్రమంలో ఆమె ఎదుర్కునే సవాళ్ళు ఏంటి..? అనే దాని పై సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ చివరిలో క్రైం ఫ్రీ సిటీ కావాలి అనేది రికార్డ్స్ లోనా..? రియాలిటీలోనా..? అంటూ పాయల్ ప్రశ్నించే డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Get ready for a journey filled with mystery and thrill!
The #Rakshana Trailer is out now on @adityamusic.
In Cinemas #RakshanaOnJune7th 💥@starlingpayal@PrandeepThakore@SagarMahati#AnilBandari@HaripriyaFilmspic.twitter.com/BhFPKqWfWG
— Haripriya Creations (@HaripriyaFilms) June 1, 2024
Follow Us