Nayantara : 50 సెకన్ల యాడ్‌ కోసం రూ. 5 కోట్లు వసూలు చేసిన లేడీ సూపర్‌ స్టార్‌!

నయనతార టాటా స్కై కోసం ఓ యాడ్‌ చేసేందుకు ఒప్పందం చేసుకుంది. అయితే ఆ యాడ్ నిడివి కేవలం 50 సెకండ్లు మాత్రమే . అందుకోసం ఆమె ఏకంగా తన పారితోషకంగా రూ. 5 కోట్లను వసూలు చేసింది.సాధారణంగా నయన్‌ ఒక సినిమా కోసం రూ. 10 కోట్ల వసూలు చేస్తుంది.

New Update
Nayantara : 50 సెకన్ల యాడ్‌ కోసం రూ. 5 కోట్లు వసూలు చేసిన లేడీ సూపర్‌ స్టార్‌!

Nayantara : చాలా కాలం ముందు వరకు సినిమాల్లో హీరోల కంటే హీరోయిన్లకు రెమ్యూనరేషన్‌ తక్కువగానే ఉండేది. రానురాను అది మారింది. హీరోలతో సమానంగా హీరోయిన్లు కూడా పారితోషకాన్ని అందుకుంటున్నారు. వారిలో చాలా మంది ముద్దుగుమ్మలు యాడ్‌ ఫిలిం(Ad Film) ల ద్వారా భారీగా నగదు రాబట్టుకుంటున్నారు.

Nayantara

సౌత్ సినిమాల్లో బాగానే సంపాదిస్తున్న ఓ నటి అయితే ఏకంగా 50 సెకన్ల ప్రకటన కోసం ఏకంగా రూ. 5 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఇంతకీ ఆ భామ ఎవరో తెలుసా లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార(Nayantara) . నయనతార సినిమాల్లోకి రాకముందు టెలివిజన్ యాంకర్‌(Anchor) గా చేసిందనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ అమ్మడు టాటా స్కై(Tata Sky)  కోసం ఓ యాడ్‌ చేసేందుకు ఒప్పందం చేసుకుంది. అయితే ఆ యాడ్ నిడివి కేవలం 50 సెకండ్లు మాత్రమే . అందుకోసం ఆమె ఏకంగా తన పారితోషకంగా రూ. 5 కోట్లను వసూలు చేసింది.

Nayantara

ఈ యాడ్‌ ను మేకర్స్‌ కేవలం రెండే రోజుల్లో షూట్‌ చేశారు. ఈ యాడ్‌ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల అయ్యింది. దీంతో విషయం తెలుసుకున్న సినీ వర్గాలు నోరెళ్లబెడుతున్నాయి. సాధారణంగా నయన్‌ ఒక సినిమా కోసం రూ. 10 కోట్ల వసూలు చేస్తుంది.
నయన్ కు కేవలం సౌత్‌ లోనే కాకుండా అటు బాలీవుడ్ లో కూడా భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది.

నయన్‌ టెలివిజన్ హోస్ట్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఫ్యాషన్, లైఫ్ స్టైల్ షో అయిన చమయం షోతో ఆమె టీవీ అరంగేట్రం చేసింది. దీని తరువాత, మలయాళ చిత్రం మనసినక్కరేతో వెండితెర మీదకు అడుగు పెట్టింది. ఇది బ్లాక్ బస్టర్ హిట్‌ అయ్యింది. ఆ తరువాత నయన్‌ వెనక్కి తిరిగి చూసుకోలేదు. లేడీ సూపర్‌ స్టార్‌ అయ్యి హీరోలకు పోటీగా నిలిచింది.

Nayantara - Vignesh Shivan

తమిళ దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌(Vignesh Shivan) ను పెళ్లి చేసుకుని , మగ కవల పిల్లలకు తల్లి కూడా అయ్యింది. అయినప్పటికీ నయన్‌ జోరు ఏ మాత్రం తగ్గలేదు. నయన్‌ ఆస్తులు విలువ కూడా చాలా ఎక్కువ. నయన్‌ కు ఓ ప్రైవేట్‌ జెట్‌ కూడా ఉంది. గత సంవత్సరం, అట్లీ దర్శకత్వం వహించిన 'జవాన్' చిత్రంలో షారుక్ ఖాన్‌తో కలిసి నయనతార బాలీవుడ్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది.

Also Read : పిల్లల కోసం పెళ్లి చేసుకుంటాను: మెగా డాటర్!

Advertisment
Advertisment
తాజా కథనాలు