Nabha Natesh : పెళ్లి చేసుకోనంటే చేసుకోను.. RTV తో తన సీక్రెట్స్ షేర్ చేసుకున్న'ఇస్మార్ట్' బ్యూటీ..! తానసలే పెళ్లి చేసుకోనంటూ బాంబు పేల్చింది ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నభా నటేష్. ఆమె తాజాగా నటించిన 'డార్లింగ్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆర్టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇంటర్వ్యూలో ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఆసక్తికర అంశాల కోసం ఈ ఆర్టికల్ ను చదవండి. By Anil Kumar 18 Jul 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Actress Nabha Natesh Interview With RTV : సుధీర్ బాబు సరసన 'నన్ను దోచుకుందువటే' అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది నబా నటేష్. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసి ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. ఇక 'ఇస్మార్ట్ శంకర్' మూవీ తో ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఆ సినిమాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ తెలంగాణ స్లాంగ్ తో అదరగొట్టింది. అంతకు ముందు ఒకటి రెండు సినిమాలు చేసినా రాని గుర్తింపు ఈ సినిమాతో సొంతం చేసుకుంది. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ సరసన 'డిస్కో రాజా', సాయి ధరమ్ తేజ్ కి జోడిగా 'సోలో బ్రతికే సో బెటర్', బెల్లంకొండ శ్రీనివాస్ సరసన 'అల్లుడు అదుర్స్' వంటి సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలేవి ఈమెకి ఆశించిన స్థాయి విజయాలను అందించలేకపోయాయి. ఆ తరువాత అనుకోకుండా ఓ రోడ్డు ప్రమాదానికి గురి గురి కావడంతో రెండు చోట్ల ఎముకలు విరిగి సర్జరీ చేయించుకుంది. దాంతో ఏడాది పాటు సినిమాలకు దూరమైంది. మళ్లీ లాంగ్ గ్యాప్ అనంతరం 'డార్లింగ్' అనే మూవీతో ఆడియన్స్ ముందుకు వస్తోంది. ప్రియదర్శి సరసన ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ గా కనిపించనుంది నభా నటేష్. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఆడియన్స్ ను బాగా ఇంప్రెస్ చేశాయి. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ జులై 19 న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే నభా నటేష్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆర్టీవికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో తన సినీ కెరీర్ తో పాటూ తన యాక్సిడెంట్ గురించి, అలాగే పెళ్లి గురించి కూడా పలు ఆసక్తికర విశేషాలు పంచుకుంది. #actress-nabha-natesh #nabha-natesh-interview మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి