Ketika Sharma: రెడ్ డ్రెస్ లో యంగ్ బ్యూటీ కేతిక శర్మ హాట్ లుక్స్ టాలీవుడ్ లేటెస్ట్ బ్యూటీ కేతిక శర్మ స్టన్నింగ్ ఫోటోషూట్ తో గ్లామర్ డోస్ పెంచేసింది. తాజాగా రెడ్ డ్రెస్ లో ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. స్టైలిష్ గా హాట్ ఫోజులతో అందరినీ ఆకట్టుకుంటుంది. By Archana 15 Feb 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Ketika Sharma: టాలీవుడ్ యంగ్ బ్యూటీ కేతిక శర్మ. కొత్తగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకీ సరైన హిట్ ఒక్కటి కూడా పడలేదు. ప్రస్తుతం ఈ భామ కెరీర్ లో మంచి హిట్ కోసం ఎదురుచూస్తుంది. కేతిక శర్మ.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పరిచయమైంది. ఈ సినిమాలో పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి సరసన నటించింది. 2021 లో విడుదలైన 'రొమాంటిక్' అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయినా సరే ఈ అమ్మడుకు అవకాశాలు మాత్రం తగ్గలేదు. నటనతోనే కాదు అందచందాలతో కూడా వావ్ అనిపిస్తుంది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్ గా ఉండే కేతిక.. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. కుర్రాళ్ళ మతి పోగొడుతుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన మరో లేటెస్ట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరలవుతుంది. ట్రెండీ రెడ్ డ్రెస్ ధరించి హాట్ ఫోజులతో అందరినీ ఆకట్టుకుంటుంది. రొమాంటిక్ తర్వాత కేతిక నాగ సౌర్య సరసన లక్ష్య, మెగా హీరో వైష్ణవ్ తేజ్ రంగ రంగ వైభవంగా సినిమాలో నటించింది. ఈ సినిమాలు కూడా ఒకే అన్నట్లుగానే ప్రేక్షకులను అలరించాయి. రీసెంట్ గా ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన బ్రో సినిమాలో నటించింది. సూపర్ నేచురల్ ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను నటుడు సముద్రఖని డైరెక్ట్ చేశారు. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ కూడా చేస్తున్నట్లుగా కనిపించడం లేదు. కేతిక శర్మ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఈ అమ్మడు 1995 డిసెంబర్ 24న ఢిల్లీలో జన్మించింది. మోడలింగ్ తో కెరీర్ స్టార్ చేసిన కేతిక.. డబ్ స్మాష్ వీడియోలతో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ గా ఫుల్ పాపులర్ అయ్యింది. ఈ ఇన్స్టాగ్రామ్లో 2.5 మిలియన్ ఫాలోవర్లను సొంతం చేసుకుంది. Also Read: OTT Trending Movies: ఓటీటీలో టాప్ 3 ట్రేండింగ్ మూవీస్.. చివరిలో స్థానంలో ఆ సినిమానే..! Also Read: Chiranjeevi: భార్యతో మెగాస్టార్ హాలిడే ట్రిప్.. ఉపాసన ఇంట్రెస్టింగ్ పోస్ట్..! #ketika-sharma-latest-photos మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి