Kavya Thapar : 'ఇస్మార్ట్ శంకర్' లో నేనే హీరోయిన్ గా చేయాల్సింది.. ఆడిషన్స్ కు కూడా వెళ్ళా, కానీ.. హీరోయిన్ కావ్య థాపర్ 'ఇస్మార్ట్ శంకర్' మూవీలో నటించే ఛాన్స్ కోల్పోయానని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.' ఇస్మార్ట్ శంకర్‌కు ఆడిషన్స్ ఇచ్చా. కానీ నేను సెలెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు 'డబుల్ ఇస్మార్ట్' సినిమాలో పూరీ సార్‌తో కలిసి పనిచేయడం అద్భుతంగా అనిపించింది' అని అన్నారు. By Anil Kumar 06 Aug 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Actress Kavya Thapar : బాలీవుడ్ నటి కావ్య థాపర్ 'ఇస్మార్ట్ శంకర్' మూవీలో నటించే అవకాశాన్ని కోల్పోయానని వెల్లడించారు. ఈ విషయాన్ని ఆమె తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'డబుల్ ఇస్మార్ట్'. ఈ మూవీపై భారీగా అంచనాలున్న సంగతి తెలిసిందే. 'ఇస్మార్ట్ శంకర్' కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీలో రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది. ఆగస్టు 15 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది . ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ కావ్యథాపర్ మీడియాతో చిట్ చాట్ సెషన్లో సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విశేషాలు షేర్ చేసుకుంది. Also Read : బిగ్ బాస్ ఫ్యాన్స్ కు భారీ షాక్..హోస్టింగ్ నుంచి తప్పుకున్న స్టార్ హీరో..! చిట్ చాట్ లో భాగంగా కావ్య థాపర్ కు 'డబుల్ ఇస్మార్ట్' లో అవకాశం ఎలా వచ్చింది? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి కావ్య బదులిస్తూ..' పూరీ, ఛార్మీ మేడమ్‌కు ఆడిషన్స్ లో నా పర్ఫార్మెన్స్ నచ్చింది. చిన్న ప్రమాదం కారణంగా కొంత బరువు పెరిగా. అందువల్ల బరువు తగ్గాలని వాళ్లు నాకు సూచించారు. రెండు నెలల హార్డ్ వర్క్ తర్వాత డబుల్ ఇస్మార్ట్ పాత్రకు సెట్ అయ్యాను. రామ్, సంజయ్ దత్ సార్‌తో పనిచేయడం థ్రిల్‌గా ఫీలయ్యా. పూరీ, మణిశర్మ సార్‌తో కలిసి పనిచేయడం అద్భుతంగా అనిపించింది. ఆసక్తికర విషయమేంటంటే..ఇస్మార్ట్ శంకర్‌కు ఆడిషన్స్ ఇచ్చా.. కానీ ఆ సినిమాకు నేను సెలెక్ట్ అవలేదు" అని తెలిపింది. #actress-kavya-thapa #double-ismart-movie సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి