Anushka Shetty : అయ్యో పాపం జేజమ్మ.. అనుష్క అతిగా నవ్వితే అంతేనట!

హీరోయిన్ అనుష్క శెట్టి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో తనకు అరుదైన వ్యాధి సోకిందని తెలిపింది. ఈవ్యాధి వల్ల ఏం జరుగుతుందంటే.. తాను నవ్వడం మొదలుపెడితే ఆపుకోలేక నవ్వుతూనే ఉంటుందట. మళ్లీ సాధారణ స్థితికి రావడానికి కనీసం 15-20 నిమిషాలు పడుతుందని వెల్లడించింది.

New Update
Anushka Shetty : అయ్యో పాపం జేజమ్మ.. అనుష్క అతిగా నవ్వితే అంతేనట!

Actress Anushka Shetty Suffering With Rare Disease : సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరితో ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మ 'అరుంధతి' మూవీతో (Arundhati Movie) సౌత్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పునాది వేసింది. ఇక గత ఏడాది 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీతో మంచి సక్సెస్ అందుకుంది.

ప్రస్తుతం మళయాలంలో ఓ సినిమా చేస్తున్న అనుష్క శెట్టి.. తాజాగా తన ఆరోగ్యం గురించి షాకింగ్ విషయాలు రివీల్ చేసింది. తాజా ఇంటర్వ్యూలో తనకు అరుదైన వ్యాధి సోకిందని తెలిపింది. ఈవ్యాధి వల్ల ఏం జరుగుతుందంటే.. తాను నవ్వడం మొదలుపెడితే ఆపుకోలేక నవ్వుతూనే ఉంటుందట. మళ్లీ సాధారణ స్థితికి రావడానికి కనీసం 15-20 నిమిషాలు పడుతుందని వెల్లడించింది.

Also Read : ‘విశ్వంభర’ సెట్స్ లో స్టార్ డైరెక్టర్.. వైరల్ అవుతున్న పిక్!

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనుష్క శెట్టి దీని గురించి మాట్లాడుతూ.." నాకు లాఫింగ్ వ్యాధి ఉంది. నవ్వడం కూడా ఒక వ్యాధి అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కానీ నా విషయంలో అలా ఉంది. ఒక్కసారి నవ్వడం మొదలుపెడితే 15-20 నిమిషాల పాటు నవ్వు ఆపుకోవడం కష్టం. కామెడీ సన్నివేశాన్ని చూస్తున్నప్పుడు లేదా షూట్ చేస్తున్నప్పుడు, నేను నవ్వుతూ నేలపై పడుకుంటాను. దీంతో షూటింగ్ ఆపేయాల్సి వచ్చిందని, అలా చాలా సార్లు జరిగిందని" చెప్పుకొచ్చింది..

ఈ వ్యాధి లక్షణాలు ఏంటి?

ఇంటర్వ్యూలో అనుష్క తెలిపిన దాని ప్రకారం.. ఆమెకు 'సూడోబుల్బార్ ఎఫెక్ట్' (Pseudobulbar Effect) అంటే PBA అనే ​​వ్యాధి ఉంది. ఇది అరుదైన నాడీ సంబంధిత రుగ్మత మరియు ఇది నేరుగా మెదడును ప్రభావితం చేస్తుంది. ఈ స్థితిలో వ్యక్తి అదుపు లేకుండా నవ్వడం లేదా ఏడవడం ప్రారంభిస్తాడు. కాగా అనుష్కకు ఇలాంటి వ్యాధి ఉందని తెలిసి ఆమె అభిమానులు ఒకింత షాక్ కు గురవుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు