Actress Anjali: విడాకులు తీసుకున్న నిర్మాతతో.. హీరోయిన్ అంజలి పెళ్లి?

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది నటి అంజలి. అయితే కొంతకాలం క్రితం ఆమె పెళ్ళికి సంబంధించి పలు రకాల వార్తలు వైరలైన సంగతి తెలిసిందే. తాజాగా మరో సారి అంజలి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం మొదలైంది. త్వరలో ఓ టాలీవుడ్ నిర్మాతను పెళ్లాడనుందని టాక్.

New Update
Actress Anjali: విడాకులు తీసుకున్న నిర్మాతతో..  హీరోయిన్ అంజలి పెళ్లి?

Actress Anjali: టాలీవుడ్ నటి అంజలి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు తెలుగు హీరోయిన్ అయినప్పటికీ తమిళ సినిమాల ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. కరతు అనే తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అంజలి.. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకొని.. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తమిళ్లో వరుస చిత్రాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అక్కడి నుంచి తెలుగులో అడుగు పెట్టిన ఈ బ్యూటీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.

Also Read: Ketika Sharma: బీచ్ అందాలతో పోటీపడుతున్న హాట్ బ్యూటీ కేతిక.. వైరలవుతున్న ఫొటోలు..!

నిర్మాతతో నటి అంజలి వివాహం

ఇది ఇలా ఉంటే.. కొంత కాలంగా ఈమె పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో అవుతూనే ఉన్నాయి. ఆ మధ్య ఒక బిజినెస్ మెన్ పెళ్ళాడి విదేశాల్లో సెటిల్ అయ్యారని వార్తలు వచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేసింది. అయితే తాజాగా మరో సారి అంజలి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం మొదలైంది. త్వరలోనే ఓ టాలీవుడ్ నిర్మాతను పెళ్లాడనుందని టాక్ వినిపిస్తోంది. గతేడాదిగా ఓ తెలుగు నిర్మాతతో ఆమె డేటింగ్ లో ఉన్నట్లు.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వైరలవుతున్నాయి.

publive-image

కాగా , గతంలో ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న అంజలి ప్రేమకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు బయట పెట్టింది. ఓ వ్యక్తితో ఉన్న రిలేషన్ షిప్ కారణంగా కెరీర్ పై దృష్టి పెట్టలేకపోయానని. అది రాంగ్ రిలేషన్ షిప్ అని .. కెరీర్ కు అడ్డుగా ఉన్న రిలేషన్ షిప్ కంటే కెరీర్‌కే ఇంపార్టెన్స్ ఇవ్వడం మంచిదని ఆమె తెలిపింది. ఇక ఇప్పుడు నిర్మాతతో పెళ్లి అంటూ వస్తున్న వార్తల పై ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి.

Also Read: RC16 Movie: విలన్‌ లేని చెర్రి సినిమా.. ఫ్యాన్స్‌లో ఒక్కసారిగా పెరిగిపోయిన హైప్

Advertisment
Advertisment
తాజా కథనాలు