Aishwarya Rajesh : గ్లామర్ రోల్స్ చేయకపోవడానికి కారణం అదే : ఐశ్వర్య రాజేష్

ఐశ్వర్య రాజేష్ ఇటీవల ఇంటర్వ్యూలో గ్లామర్ రోల్స్ చేయకపోవడంపై క్లారిటీ ఇచ్చారు. గ్లామర్ రోల్స్ చేయడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అందం కంటే నటన ముఖ్యం అని నేను నమ్ముతాను. యాక్టింగ్ కు స్కోప్ ఉండే పాత్ర ఇస్తే ఖచ్చితంగా చేస్తానని చెప్పింది.

New Update
Aishwarya Rajesh : గ్లామర్ రోల్స్ చేయకపోవడానికి కారణం అదే : ఐశ్వర్య రాజేష్

Actress Aishwarya Rajesh about Glamour Roles : తెలుగు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తమిళ సినీ పరిశ్రమలో హీరోయిన్ గా భారీ గుర్తింపు తెచ్చుకుంది. సహాయ నటిగా కెరియర్ స్టార్ట్ చేసిన ఈమె ఆ తర్వాత హీరోయిన్ గా మారి తమిళంలో కొన్ని సూపర్ హిట్ సినిమాలు చేసి సక్సెస్ అందుకుంది. తెలుగులో ఒకటి, రెండు సినిమాల్లో నటించినా వాటితో పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ప్రస్తుతం కోలీవుడ్ లోనే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తోంది.

ఓవైపు అగ్ర హీరోల సరసన నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ చేస్తూ దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ఐశ్వర్య ఇప్పటిదాకా గ్లామర్ పాత్రలు చేయలేదు.కేవలం డీ గ్లామర్ రోల్స్ తోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలోఆమె గ్లామర్ పాత్రలపై తన అభిప్రాయాన్ని తెలియజేసింది.

Also Read : గోల్డెన్ వీసా అందుకున్న మంచు విష్ణు..!

అందం కంటే నటన ముఖ్యం..

ఇంటర్వ్యూలో ఐశ్వర్య మాట్లాడుతూ.." గ్లామర్ పాత్రలు చేయడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ నా పాత్రకు ఒక కథ, ఒక సందేశం ఉండాలి. అందం కంటే నటన ముఖ్యం అని నేను నమ్ముతాను. యాక్టింగ్ కు స్కోప్ ఉండే పాత్ర ఇస్తే ఖచ్చితంగా చేస్తాను" అని చెప్పింది.

కొత్తగా నేర్పించాలి...

ఇదే ఇంటర్వ్యూలో ఐశ్వర్య తన సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటానని చెప్పింది. "నేను ఒక పాత్రను ఎంచుకునేటప్పుడు, ఆ పాత్ర నాకు ఏదైనా కొత్తగా నేర్పించాలి అని ఆశిస్తాను. ఒకే రకమైన పాత్రలు చేయడం నాకు ఇష్టం లేదు. గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యత ఇచ్చే పాత్రలు కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. సినిమాలు కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, సమాజానికి ఒక సందేశం కూడా ఇవ్వాలి" అని తెలిపింది.



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు