Sharwanand : శర్వానంద్ కి కొత్త ట్యాగ్.. ఇక నుంచి స్టార్ శర్వానంద్, ఏ స్టార్ అంటే? ‘మనమే’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ శర్వానంద్‌కు చామింగ్ స్టార్ అనే బిరుదు ఇచ్చారు. ఈ మేరకు రూపొందించిన ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు. ఇన్నేళ్లు తన పేరుకి ముందు ఎలాంటి ట్యాగ్ లేని శర్వానంద్ ఇక నుంచి 'చామింగ్ స్టార్' శర్వానంద్ గా కొనసాగబోతున్నాడు. By Anil Kumar 06 Jun 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Sharwanand As Charming Star : శర్వానంద్ (Sharwanand) హీరోగా శ్రీరామ్ ఆదిత్య (Sriram Aditya) దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ మూవీ ‘మనమే’ (Manamey). పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రూపొందిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. యంగ్ బ్యూటీ కృతి శెట్టి (Kriti Shetty) ఫీమేల్ లీడ్ లో నటించగా.. విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే టీజర్, సాంగ్స్ తో ఆకట్టుకున్న ఈ చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దర్శకులు మారుతి, శివ నిర్వాణ, సాయి రాజేశ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరైన ఈ ఈవెంట్ లో చిత్ర నిర్మాత హీరో శర్వానంద్ కి ఓ సరికొత్త బిరుదు ఇచ్చాడు. Also Read : ‘ధర్మం దే విజయం’… వైరలవుతున్న ‘హరిహరవీరమల్లు’ కొత్త పోస్టర్ ఇక నుంచి చామింగ్ స్టార్‌గా... ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ శర్వానంద్‌కు చామింగ్ స్టార్ అనే బిరుదు ఇచ్చారు. ఈ మేరకు రూపొందించిన ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు. ఇన్నేళ్లు తన పేరుకి ముందు ఎలాంటి ట్యాగ్ లేని శర్వానంద్ ఇక నుంచి 'చామింగ్ స్టార్' శర్వానంద్ గా కొనసాగబోతున్నాడు. ఇక ఈ ట్యాగ్ శర్వానంద్ కి సరిగ్గా సూట్ అవుతుందని అతని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. #kriti-shetty #sharwanand #sriram-aditya #manamey-pre-release సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి