Prakash Raj: దయచేసి క్షమించు.. నటుడు ప్రకాశ్‌రాజ్ ఎమోషనల్ ట్వీట్..!!

నటుడు సిద్ధార్థకు ప్రకాశ్‌రాజ్ కర్ణాటక ప్రజల తరపున సారీ చెప్పారు. సినిమా చిత్త (కన్నడంలో చిక్కు) ప్రచారం కోసం హీరో సిద్ధార్థ బెంగళూరు వచ్చారు. అయితే మీడియా సమావేశంలో ఆయన మాట్లాడడం ప్రారంభించడానికి ముందే కన్నడ అనుకూల సంస్థల సభ్యులు ఆటంకం కలిగించారు. దీంతో సిద్ధార్థ తన ఫ్యాన్స్ కు బై చెప్పి కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు.

New Update
Prakash Raj:  దయచేసి క్షమించు.. నటుడు ప్రకాశ్‌రాజ్ ఎమోషనల్ ట్వీట్..!!

Prakash Raj: నటుడు సిద్ధార్థ(Hero Siddharth )కు ప్రకాశ్‌రాజ్(Prakash Raj) కర్ణాటక ప్రజల తరపున సారీ చెప్పారు. సినిమా చిత్త (కన్నడంలో చిక్కు) ప్రచారం కోసం హీరో సిద్ధార్థ బెంగళూరు వచ్చారు. అయితే మీడియా సమావేశంలో ఆయన మాట్లాడడం ప్రారంభించడానికి ముందే కన్నడ అనుకూల సంస్థల సభ్యులు ఆటంకం కలిగించారు. తన కార్యక్రమాన్ని నిలిపివేయాలని ఆందోళన కారులు డిమాండ్ చేశారు. అయితే, వారి నిరసన  కొనసాగుతున్నా సరే సిద్ధార్థ మాట్లాడడం కొనసాగించడం ప్రారంభించాడు. తమ కావేరీ ఉద్యమానికి మద్దతు తెలపాలని ఆందోళనకారులు సిద్ధార్థను డిమాండ్ చేయడంతో పరిస్థితి మరింత ఉద్రక్తంగా మారింది. దీంతో సిద్ధార్థం చేతులు జోడించి తన ఫాన్స్ కు  బై  చెప్పి కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై స్పందించిన ప్రకాశ్‌రాజ్  సోషల్ మీడియా ద్వారా సిద్ధార్థకు క్షమాపణలు తెలిపారు.

కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ సమస్య దశాబ్దాలుగా ఉందని, ఇన్నేళ్ల కాలంలో సమస్యను పరిష్కరించలేని అసమర్థ రాజకీయ పార్టీలు, నాయకులను ప్రశ్నించలేదని, సమస్య పరిష్కారం కోసం కేంద్రం వద్ద ఒత్తిడి తీసుకురాలేని కుంటి ఎంపీలను ప్రశ్నించకుండా నిస్సహాయ సామాన్యులను, కళాకారులను చిత్రహింసలకు గురిచేయడం తప్పని, అందుకు కన్నడ ప్రజల తరపున సిద్ధార్థకు క్షమాపణలు అంటూ ప్రకాశ్‌రాజ్  తన సోషల్ మీడియాలో  పోస్ట్ చేశారు. కాగా, ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

publive-image

నటుడు ప్రకాశ్ రాజ్, సిద్ధార్థ  గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ మంచి స్నేహితులు. అంతే కాకుండా వీరు కలిసి చేసిన సినిమాలు సూపర్ హిట్ కూడా అయ్యాయి. ముఖ్యంగా టాలీవుడ్ తో పాటు ఇటు బాలీవుడ్‌లోనూ మోనార్క్‌ గా తన సత్తా చాటుకున్నారు ప్రకాశ్ రాజ్. పాత్ర ఎదైనా సరే ఇట్టే ఇమిడిపోతారు. ఇటీవల ‘మా’ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు ప్రకాశ్ రాజ్. అయితే, ఈ మధ్య  పాలిటిక్స్ లో కాస్తా బిజీగా కనిపిస్తున్నారు.

Also Read: సలార్ రిలీజ్ డేట్ చెప్పేశారు…ఎక్స్ లో ట్రెండింగ్ లో సీజ్‌ఫైర్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో 28 మంది మృతి.. తనికెళ్ల భరణి కన్నీటి కవిత

పహల్గాం టెర్రరిస్టు అటాక్‌పై సినీ నటుడు తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక కన్నీటి కవితను షేర్ చేసారు. కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది! అంటూ ఆ కవిత సాగుతుంది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.

New Update
Pahalgam Terror Attack

Pahalgam Terror Attack

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అందమైన ప్రదేశాలను చూసేందుకు వచ్చిన టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో దాదాపు 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ముస్లిమేతరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడినట్లు సాక్ష్యులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

అమాయక ప్రజల మృతిపై ఇప్పటికే సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తలు సంతాపం తెలిపారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని అస్సలు వదలకూడదని.. కఠినంగా శిక్షించాలంటూ భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ యాక్టర్ తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఒక కవితతో ఉన్న పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

కన్నీటి కవిత

కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది!
అక్కడ ఉన్నట్టుండి పాకే పాకే పసిబిడ్డ నెత్తురు ముద్దై పోతుంది. 

సామగానం చేసే కాశ్మీరీ పండితుల కంఠాల్లోంచి వేదం ఆగి- రుధిరం బైటికొస్తుంది.

అక్కడ రేపు పల్లకీ లెక్కి ఊరేగాల్సిన పెళ్ళికొడుకులు ఇవాళే పాడెక్కుతారు...

ఆ లోయలో హిమాలయాలు సైతం మూర్తీభవించిన వైధవ్యాల్లా ఉంటాయ్

భరతమాత కిరీటం వొరుసుకునీ నిరంతరం అక్కడ నెత్తురోడుతూ ఉంటుంది !

బుద్ధుడు కూడా కళ్ళూ నోరూ మూసుకుని మళ్ళీ అంతర్ముఖుడౌతాడు !!

ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం రాసిన కవిత, ఇంకా తడిగానే ఉంది!! అంటూ తనికెళ్ల భరణి ఒక కవితను పంచుకున్నారు. ఇప్పుడది నెట్టింట వైరల్‌గా మారింది. 

 

pahalgam | Pahalgam attack | pahalgam breaking news | tanikella-bharani | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment