Naga Shaurya : దర్శన్ కు సపోర్ట్ గా టాలీవుడ్ హీరో.. కలలో కూడా ఎవరికీ హాని చేయండంటూ పోస్ట్, తిట్టిపోస్తున్న నెటిజన్లు!

హీరో నాగ శౌర్య కన్నడ స్టార్ దర్శన్ ను సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఈ మేరకు దర్శన్ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. దర్శన్ అన్న కలలో కూడా ఎవరికీ హాని కలిగించే వ్యక్తి కాదు. బాగా తెలిసినవారికి అతని మంచితనం తెలుస్తుందని పేర్కొన్నాడు.

New Update
Naga Shaurya : దర్శన్ కు సపోర్ట్ గా టాలీవుడ్ హీరో.. కలలో కూడా ఎవరికీ హాని చేయండంటూ పోస్ట్, తిట్టిపోస్తున్న నెటిజన్లు!

Actor Naga Shaurya Supports Kannda Star Darshan :  కన్నడ స్టార్ హీరో దర్శన్ అభిమాని మర్డర్ కేసు లో ఇండస్ట్రీలో ఎంతటి కలకలం రేపిందో అందరికీ తెలిసిందే. దర్శన్ కి భార్య పిల్లలు ఉండగా మరో నటి ప్రవిత్రా గౌడతో సన్నిహితంగా ఉంటున్నాడు. రేణుకాస్వామి అనే దర్శన్ అభిమాని పవిత్రను సోషల్ మీడియాలో ఇబ్బంది పెట్టడంతో అతన్ని దర్శన్ హత్య చేయించాడనే ఆరోపణలతో జైలుపాలయ్యాడు. ఈ కేసులో దర్శన్, పవిత్రగౌడతో పాటు మరికొంతమంది కూడా అరెస్ట్ అయ్యారు.

రేణుక స్వామి హత్య చేసిన తర్వాత ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. చాలా దారుణంగా హింసించి అతన్ని చంపారని తెలుస్తుంది. ఈ విషయంలో దర్శన్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే దర్శన్ పై నెటిజన్స్ ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. అయితే కొందరు మాత్రం ఈ విషయంలో దర్శన్ ను సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే మన టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య సైతం దర్శను సపోర్ట్ చేస్తూ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Also Read : ప్రభాస్ ఊచకోత.. ఓవర్సీస్ లో ‘కల్కి’ ఆల్ టైమ్ రికార్డ్..!

కలలో కూడా హాని కలిగించే వ్యక్తి కాదు...

తాజాగా హీరో నాగశౌర్య దర్శన్ తో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..:" మరణించిన వ్యక్తికి సంతాపం తెలియచేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. దీనిపై అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. దర్శన్ అన్న కలలో కూడా ఎవరికీ హాని కలిగించే వ్యక్తి కాదు. అతని గురించి బాగా తెలిసినవారికి అతని మంచితనం, అతని సహాయగుణం తెలుస్తుంది.

నిర్దోషిగా బయటకు వస్తారు..

ఆపదలో ఉన్నవారిని ఎప్పుడూ అదనుకుంటారు దర్శన్ అన్న. చాలా మందికి సపోర్ట్ గా నిలిచారు. ఈ వార్తను నేను అంగీకరించలేను. మన న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది. త్వరలోనే నిజం బయటకు వస్తుంది అని నమ్ముతున్నాను. అలాగే దర్శన్ అన్న కుటుంబం కూడా భాదపడుతుందని గుర్తుంచుకోవాలి. ఎంతోమంచి వారు అయిన దర్శన్ అన్న నిర్దోషిగా బయటకు వస్తారని నమ్ముతున్నాను" అంటూ రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్స్ నాగ శౌర్య పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఓ మర్డర్ చేసిన హీరోకు ఎలా సపోర్ట్ చేస్తావని ప్రశ్నిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Naga Shaurya (@actorshaurya)

Advertisment
Advertisment
తాజా కథనాలు