Nagarjuna: రేవంత్‌రెడ్డిని కలిసిన కింగ్ నాగార్జున, అమల..! తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని టాలీవుడ్ కింగ్ నాగార్జున తన భార్య అమలతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. జూబిలీహిల్స్‌లోని సీఎం నివాసంలో నాగార్జున దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Archana 30 Dec 2023 in సినిమా రాజకీయాలు New Update షేర్ చేయండి Nagarjuna Met CM Revanth: తెలుగు సినిమా స్టార్ నాగార్జున తన నటనతో కోట్లాది హృదయాలను గెలుచుకున్నాడు. సౌత్ నుంచి నార్త్ వరకు ఆయనకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాల కోసం జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇటీవల నటుడు తెలంగాణ ముఖ్యమంత్రి నివాసంలో కనిపించారు. ఆయన సతీమణి అమల అక్కినేనితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అప్పుడు చిరు.. ఇప్పుడు నాగ్: CM రేవంత్ రెడ్డి ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. పలువురు టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు, రాజకీయ వేత్తలు రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలియజేస్తున్నారు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఆ తర్వాత కాసేపు ఆయనతో ముచ్చటించారు. ఇక తాజాగా ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున, శ్రీమతి అమల (Amala) తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా ఆయన నివాసంలో కలిసి.. పుష్ప గుచ్చం అందించి అభినందనలు తెలియజేశారు. Also Read: Kurchi Thata : మహేష్ బాబుతో నా డాన్స్ చూస్తే.. కుర్చీలు మడత పెట్టాల్సిందే..! నాగార్జున నెక్ట్స్ సినిమా: నాగర్జున తదుపరి 'నా సామి రంగ'లో (Naa Saami Ranga) కనిపించనున్నాడు. ఇది ఆయన 99వ చిత్రం. 'నా సామి రంగ' 2024 సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి విజయ్ బిన్నీ డైరెక్ట్ చేశారు. ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ రాస్తుండగా, నేషనల్ అవార్డ్.. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చనున్నారు. ఇదిలా ఉంటే, ఈ చిత్రానికి సంబంధించిన ఇతర తారలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. Also Read: Saindhav : బుజ్జి కొండవే.. నా బుజ్జి కొండవే.. ‘సైంధవ్’ ఎమోషనల్ సాంగ్ #revanth-reddy #akkineni-nagarjuna #nagarjuna-met-cm-revanth-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి