ఏఆర్ మురుగదాస్ సినిమా కోసం 33,000 అడుగుల ఎత్తులో యాక్షన్ సీన్!

ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటిస్తున్న చిత్రం ‘సికిందర్ లో భారీ యాక్షన్ సన్నివేశం ఉండబోతుంది. సముద్ర మట్టానికి 33 వేల అడుగుల ఎత్తులో విమానంలో భయపెట్టే యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నట్టు సమాచారం అందింది.

New Update
ఏఆర్ మురుగదాస్ సినిమా కోసం 33,000 అడుగుల ఎత్తులో యాక్షన్ సీన్!

దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ప్రస్తుతం శివకార్తికేయన్ నటిస్తున్న చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రుక్మిణి వసంత్‌ కథానాయికగా నటిస్తోంది. విద్యుత్ జమ్వాల్ విలన్‌గా నటిస్తున్నాడు. అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటిస్తున్న చిత్రం ‘సికిందర్’. కొన్ని వారాల క్రితం అధికారిక ప్రకటన వెలువడింది.

సాజిత్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మంధాన కథానాయికగా నటించింది. భారీ యాక్షన్ సన్నివేశంతో ఈ సినిమా షూటింగ్ 18న ముంబైలో ప్రారంభం కానుంది. సముద్ర మట్టానికి 33 వేల అడుగుల ఎత్తులో విమానంలో భయపెట్టే యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tamannaah: పెళ్లిపై తమన్నా షాకింగ్ కామెంట్స్..

తమన్నా బ్రేకప్‌ స్టోరీ అందరికి తెలిసిందే, అయితే ప్రస్తుతం పెళ్లిపై ఎలాంటి ఆలోచన లేదని మిల్కీబ్యూటీ వెల్లడించింది. కెరీర్‌పైనే దృష్టి పెట్టిన ఆమె, పెళ్లి ఆలోచన లేదని స్పష్టత ఇచ్చింది. దీంతో ఆమె ఒంటరిగా ఉండాలనుకుంటుందా? అనే చర్చ అభిమానుల్లో మొదలైంది.

New Update
Tamannaah About Marriage

Tamannaah About Marriage

Tamannaah: చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్లు ప్రేమ, పెళ్లి విషయంలో చాలాసార్లు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంటారు. త్వరగా పెళ్లి చేసుకుంటే కెరీర్‌కు బ్రేక్ పడుతుందేమోనన్న ఆందోళన, ఇంకా బ్రేకప్ ల వల్ల పెళ్లంటే  వెనకడుగు వేయడం సాధారణంగా చూస్తుంటాం.

ఇటీవల తమన్నా భాటియా కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. దాదాపు రెండు దశాబ్దాలుగా తన నటనా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న ఈ బ్యూటీ, దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు, స్పెషల్ సాంగ్స్ ద్వారా తనదైన గుర్తింపును సంపాదించుకుంది.

Also Read: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్..! సీక్రెట్ బయటపెట్టిన కళ్యాణ్ రామ్ ..

గత కొద్ది కాలంగా ఆమె విజయ్ వర్మతో డేటింగ్‌లో ఉందన్న వార్తలు జోరుగా వినిపించాయి. పలు సందర్భాల్లో ఇద్దరూ కలిసి కనిపించడంతో, వారి మధ్య సంబంధం నిజమేనని అందరూ నమ్మారు. అయితే ఇటీవల వీరి మధ్య విభేదాలు వచ్చాయని, బ్రేకప్ జరిగిందని బోలెడన్ని గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఈ వార్తలకు బలమైన ఆధారాలు వెలుగులోకి రావడంతో, అభిమానులు కూడా వారి మధ్య తేడాలు నిజమేనని నమ్మారు.

Also Read: వాళ్లను అస్సలు పట్టించుకోను.. ట్రోలర్స్ కి గట్టిగా ఇచ్చిపడేసిన మౌనీ రాయ్

అలాంటి ఆలోచన లేదు.. 

ఇప్పటికే 35 వసంతాలు పూర్తి చేసుకున్న తమన్నాను ఇటీవల ఓ కార్యక్రమంలో పెళ్లి గురించి ప్రశ్నించగా, “ఇప్పటికి తనకు అలాంటి ఆలోచన లేదని” స్పష్టం చేసింది. ప్రస్తుతం తన పూర్తి ఫోకస్ సినిమాలపైనే అని చెప్పిన ఆమె, పెళ్లిపై పెద్దగా ఆలోచించట్లేదని క్లియర్‌గా చెప్పింది.

Also Read: అజిత్ ఎనర్జీ చూసి షాకయ్యా: సునీల్

దాంతో అభిమానుల మదిలో తమన్నా ఇప్పటికీ ఒంటరిగా ఉండాలనుకుంటున్నదా? లేక బ్రేకప్ కారణంగా పెళ్లిపై నమ్మకం కోల్పోయిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరి ఆమె ఈ నిర్ణయం మారుతుందా లేదా అనేది మాత్రం కాలమే చెప్పాలి.

Also Read: రెమ్యునరేషన్‌కు లింగ భేదం ఏంటీ..? ఆసక్తికర విషయాలు వెల్లడించిన సమంతా

Advertisment
Advertisment
Advertisment