Nalgonda: అడ్డంగా బుక్కైన తహసీలద్దార్.. ఎటు చూసినా నోట్ల కట్టలే..!! నల్గొండ జిల్లా మర్రిగూడ మండల తహసీలద్దార్ మహేందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు జరిపింది. తహసీల్దార్ మహేందర్ రెడ్డి ఇంట్లో కట్టల కొద్ది నొట్ల కట్టలు దొరికాయి. దాదాపు రెండు కోట్లుకు పైగా నగదు లభ్యం అయింది.అంతే కాకుండా మహేందర్ రెడ్డి ఇంట్లో కిలోల కొద్ది బంగారం దొరికినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 30 Sep 2023 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Nalgonda: నల్గొండ జిల్లాలో అవినీతి అధికారి అడ్డంగా బుక్కైయాడు. మహేందర్ రెడ్డి (Marriguda MRO) అనే వ్యక్తి మర్రిగూడ మండలంలో తహసీలద్దార్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు మహేందర్‌రెడ్డి. దీంతో మర్రిగూడ తహసీల్దార్ మహేందర్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ(Anti Corruption Bureau) అధికారులు దాడులు చేపట్టారు. ట్రంక్ పెట్టెలో దాచి పెట్టిన నగదును గుర్తించారు. ఆ ట్రంక్ పెట్టెను వెల్డర్ సాయంతో తెరిచారు. కట్టల కొద్ది నొట్ల కట్టలు దొరకడంతో అధికారులు షాక్ అయ్యారు. కౌంటింగ్ మిషన్ సాయంతో నగదు లెక్కించగా.. రూ.2 కోట్లుగా తేలింది. అంతే కాకుండా మహేందర్ రెడ్డి ఇంట్లో కిలోల కొద్ది బంగారం కూడా దొరికింది. గతంలో కందుకూరు తహసీల్దార్‌గా పనిచేసారు మహేందర్ రెడ్డి. అయితే అక్కడ అవినీతి చేస్తున్నట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అతనిపై దృష్టి పెట్టిన అధికారులు మహేందర్ రెడ్డిని కందుకూరు నుండి మర్రిగూడ మండలానికి బదిలీకి చేశారు. అతని ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు. మర్రిగూడ మండలంలోనూ అంతే అవినీతికి పాల్పడుతున్నారని ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అధికారులు అతని ఇంటిపై దాడులు చేశారు. పెద్ద మొత్తంలో డబ్బు, బంగారం తోపాటు ఆయన ఇంట్లో పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలను గుర్తించారు. వెంటనే అతనిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా మహేందర్‌రెడ్డి ఇంటితో పాటు.. ఆయన కుటుంబ సభ్యులు, సమీప బంధువుల ఇళ్లల్లో దాదాపు 15 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. Also Read: తెలంగాణలో సంచలన తీర్పు.. ఆ దుర్మార్గుడికి ఉరి శిక్ష..!! #nalgonda #acb-rides #marriguda-mro మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి