/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/HCA.jpg)
ACB Raids on HCA : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఉప్పల్ స్టేడియంలోని HCA పరిపాలనా భవనంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ దాడుల్లో ఏసీబీ అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు సమాచారం. కాగా HCAలో నిధుల గోల్మాల్ జరిగినట్లు పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఈరోజు అసోసియేషన్ పై ఏసీబీ రైడ్స్ చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటె.. 2023 అక్టోబరు నెలలో HCAలో నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఉప్పల్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. 2019- 2022 మధ్య కాలంలో అపెక్స్ కౌన్సిల్ నేతృత్వంలో బీసీసీఐ నుంచి వచ్చిన ఫండ్స్, ఖర్చులు, టెండర్లు, కొటేషన్ల విషయంలో అవకతవకలు జరిగినట్లుగా ఫోరెన్సిక్ ఆడిట్ లో తేలింది. దీంతో 2019- 2022 మధ్య కాలంలో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్, ఉపాధ్యక్షుడిగా జాన్ మనోజ్, సెక్రటరీగా విజయానంద్, జాయింట్ సెక్రటరీగా నరేశ్ శర్మ, ట్రెజరర్‌గా సురేందర్ అగర్వాల్, కౌన్సిలర్‌గా అనురాధ ఉన్న వీరిపై త్వరలో ఏసీబీ అధికారులు విచారణ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.