Electrical Office : అశ్వారావుపేట ట్రాన్స్ కో(TRANSCO) ఏఈ శరత్ కుమార్(AE Sarath Kumar) రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అశ్వారావుపేట మండల పరిధిలోని మద్దికొండలో కొనకళ్ల ఆదిత్య అనే రైతుకు చెందిన వ్యవసాయ క్షేత్రానికి విద్యుత్ కనెక్షన్ కోసం ఆయన లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆ రైతు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో పక్కా స్కెచ్ శరత్ కుమార్ ను ఏసీబీ(ACB Raids) అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం అశ్వరాపేట సబ్ స్టేషన్ లో సోదాలు నిర్వహించారు.
Maoist: ఆపరేషన్ కర్రెగుట్ట.. మావోయిస్టులను చుట్టుముట్టిన భద్రతాబలగాలు.. భీకర యుద్ధం!
తెలంగాణ గడ్డపై మావోయిస్టులు, భద్రతాబలగాలకు మధ్య భీకర పోరు జరగనుంది. ములుగు జిల్లా కర్రెగుట్టను పోలీసులు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గుట్టచుట్టూ బాంబులు పెట్టినట్లు మావోయిస్టులు ప్రకటించగా ఏం జరగబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది.
Maoist: తెలంగాణ గడ్డపై మావోయిస్టులు, భద్రతాబలగాలకు మధ్య భీకర పోరు జరగనుంది. ములుగు జిల్లా కర్రెగుట్టను పోలీసులు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గుట్టచుట్టూ బాంబులు పెట్టినట్లు మావోయిస్టులు ప్రకటించగా ఏం జరగబోతుందనేది ఉత్కంఠరేపుతోంది.
వెయ్యి మందికిపైగా సాయుధ బలగాలు..
ఈ మేరకు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా దళం ములుగు జిల్లా కర్రెగుట్టల్లో సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు కర్రెగుట్ట పరిసర ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టాయి. వెంకటాపురం మండల పరిధిలో ఉన్నతాధికారులు భారీగా సాయుధ బలగాలను మోహరించారు. వెయ్యి మందికిపైగా సాయుధ బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. దీంతో ములుగు జిల్లా పరిసరప్రాంతాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇదిలా ఉంటే.. సోమవారం జార్ఖండ్ లోనూ భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. కీలక నేత వివేక్ కూడా హతమైనట్లు పోలీసులు వెల్లడించారు. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు సోమవారం ఉదయం మవోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు జరిపినట్లు తెలిపారు. బొకారో జిల్లాలో CRPF కోబ్రా కమాండోలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు నక్సలైట్లు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. 'లాల్పానియా ప్రాంతంలోని లుగు హిల్స్‌లో ఉదయం 5.30 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగాయి. 209 కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్ (కోబ్రా) దళాలు ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ఇందులో ఆరుగురు నక్సల్స్ మరణించారు. ఒక INSAS రైఫిల్, ఒక సెల్ఫ్-లోడింగ్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పోలీసు బలగాలు, నక్సల్స్ మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు చెప్పారు.