Andhra Pradesh: జోగి రాజీవ్‌, సర్వేయర్ రమేష్ కు రిమాండ్

అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలో అరెస్ట్ అయిన జోగి రాజీవ్, సర్వేయర్ రమేష్ ను... ఏసీబీ కోర్టు లో ఈరోజు అధికారులు హాజరుపరిచారు. ఈ కేసులో ఇరు వర్గాల తరఫున వాదనలు విన్న న్యాయమూర్తి..ఈ నెల 23వ తేదీ వరకు ఇద్దరికీ జ్యూడీషియల్ రిమాండ్ విధించారు.

New Update
Andhra Pradesh: జోగి రాజీవ్‌, సర్వేయర్ రమేష్ కు రిమాండ్

Court remanded Jogi Rajeev:  అగ్రిగోల్డ్ భూమి వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్‌కు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 23వ తేదీ వరకు జ్యూడిషియల్ కస్టడీలో ఉంచాలని చెప్పింది. అంబాపురం అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో సీఐడీ అధికారులు రాజీవ్‌ను ఈరోజు ఉదయం అరెస్టు చేశారు. ఈ అంశంలో మొత్తం 9 మందిపై కేసు నమోదైంది. ప్రస్తుతం కోర్టు జోగి రాజీవ్‌తో పాటూ సర్వేయర్ రమేష్‌ కు కూడా రిమాండ్ విధించింది. దీంతో ఇద్దరినీ విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.

అగ్రిగోల్డ్ భూ వ్యవహారం కేసులో జోగి రాజీవ్ ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఇతనితో పాటూ ఏ2 గా మాజీ మంత్రి జోగి రమేశ్ బాబాయ్ వెంకటేశ్వర్రావు ఉన్నారు. వీరి మీద ఏసీబీ ఐపీసీ 420, 409, 467, 471, 120(బి) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. మొదట జోగి రమేశ్ ఇంట్లో సోదాలు చేసిన తర్వాత ఏసీబీ రాజీవ్‌ను అదుపులోకి తీసుకుంది. తర్వాత విజయవాడ జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపర్చారు.

Also Read:Delhi: ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షులను ప్రకటించిన ఏఐసీసీ

Advertisment
Advertisment
తాజా కథనాలు