CM Kejriwal: సీఎం కేజ్రీవాల్ కు ఈడీ బిగ్ షాక్

లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీని సహ నిందితులుగా మారుస్తామని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది.

New Update
Kejriwal: 8.5కిలోల బరువు తగ్గిన కేజ్రీవాల్.. ఆందోళనలో ఆప్‌!

CM Kejriwal: లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీని సహ నిందితులుగా మారుస్తామని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. కాగా ఈరోజు లిక్కర్ స్కాం కేసులో తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతున్న క్రమంలో ఈడీ ఈ వ్యాఖ్యలు చేసింది.

లిక్కర్ స్కాం కేసులో అరెస్టై ఇటీవల మధ్యంతరం బెయిల్ పై తీహార్ జైలు నుంచి విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ కేసులో తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పలు సార్లు ఆయన వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం వాయిదా వేస్తూ వచ్చింది. ఇటీవల ఈ పిటిషన్ జరిపిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. 

ALSO READ: పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు తగ్గింది: సర్వే

లిక్కర్ స్కాం కేసులో తన అరెస్ట్ అక్రమమని.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కనుసందాల్లో ఈడీ పనిచేస్తుందని ఆరోపిస్తూ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు ఈ కేసు న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. దీనిపై తుది తీర్పు ను వెలువరించనుంది. కాగా సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పును పై యావత్ భారత్ మొత్తం వేచి చూస్తోంది. ఆయన కేసు నుంచి బయటపడుతారా లేదా జైలు జీవితాన్ని కొనసాగిస్తారా? అనే చర్చ దేశ రాజకీయాల్లో నెలకొంది. మరికొన్ని గంటల్లో సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించనుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు