Crime: వివాహితతో సహజీవనం.. పసి బిడ్డను నేలకేసి కొట్టి చంపిన దుర్మార్గుడు!

వివాహితతో సహజీవనం చేస్తున్న ఓ దుర్మార్గుడు ఆమె పసి బిడ్డను నేలకేసి కొట్టి చంపిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఆమె ముగ్గురు పిల్లలను పోషించడం భారంగా భావించిన ప్రదీప్ మద్యం మత్తులో ఏడాదిన్నర బాలుడిని అత్యంత దారుణంగా హతమార్చాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

New Update
Crime: వివాహితతో సహజీవనం.. పసి బిడ్డను నేలకేసి కొట్టి చంపిన దుర్మార్గుడు!

Chittoor: పరాయి పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న వివాహిత తన ముక్కుపచ్చలారని బిడ్డను పోగొట్టుకుంది. భర్తను వదిలేసి ముగ్గురు పిల్లలతో కలిసి ప్రేమించిన వాడి మోజులో ఇళ్లు వదిలి వచ్చేసింది. ఈ క్రమంలో అంతా బాగానే చూసుకుంటున్నట్లు నమ్మించిన కామాంధుడు.. మోజు తీరిత తర్వాత అసలు రూపం బయటపెట్టాడు. పిల్లలను భారంగా భావించి ఒక్కొక్కరిగా అంతం చేసి ఆమె ఒక్కదాన్ని మాత్రమే ఉంచుకోవాలనుకున్నాడు. ఇందులో భాగంగానే ఏడాదిన్నర బాలుడిని మద్యం మత్తులో నేలకేసి కొట్టి చంపేశాడు. మళ్లీ ఏమీ ఎరగనట్లు దాబాపై నుంచి పడిపోయిందని నాటకం మొదలుపెట్టాడు. బంధువుల అనుమానంతో అసలు విషయం బయటపడగా వివరాలు ఇలా ఉన్నాయి.

భార్య ప్రవర్తనపై అనుమానంతో..
ఈ మేరకు ఎస్సై వెంకట సుబ్బమ్మ వివరాల ప్రకారం.. చిత్తూరు గ్రామీణ మండలం దిగుమాసాపల్లెలో శనివారం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. తవణంపల్లె మండలం మాధవరం సమీప కృష్ణాపురానికి చెందిన శిరీషకు ఐరాల మండలం జంగాలపల్లెకి చెందిన చంద్రప్రకాష్‌తో కొన్నేళ్ల కిందట పెళ్లి జరిగింది. వారికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. శిరీషకు మతిస్థిమితం లేకపోగా, కాస్త నత్తి కూడా ఉంది. అయితే భార్య ప్రవర్తనపై అనుమానంతో చంద్రప్రకాష్‌ తరచూ ఆమెను దూరం పెట్టాడు. దీంతో పిల్లలతో కలిసి భర్తకు దూరంగా ఉంటున్న శిరీషకు అదే గ్రామానికి చెందిన ప్రదీప్‌తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు.

పిల్లాడు ఇంటిపై నుంచి పడి చనిపోయాడని..
అయితే ఈ క్రమంలోనే 25 రోజుల క్రితం పనుల కోసం ముగ్గురు పిల్లలతో కలిసి దిగుమాసాపల్లెలోని ఓ కోళ్లఫారంలో చేరారు. పిల్లల పోషణ భారమనుకున్న ప్రదీప్‌.. శనివారం మద్యం తాగి వచ్చి దినేష్‌ ను నేలకేసి కొట్టి చంపేశాడు. పిల్లాడు ఇంటిపై నుంచి పడి చనిపోయాడని, కొన ఊపిరితో ఉన్నాడని శిరీషతో చెప్పాడు. ఇద్దరూ కలిసి దినేష్‌ను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. శిరీష తన కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి విషయం చెప్పింది. వారికి అనుమానం వచ్చి దినేష్‌ను చూపాలని పట్టుబట్టారు. బాలుడి ముక్కు, నోటి నుంచి రక్తం రావడం, ప్రదీప్‌ మాటతీరు, ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో శిరీష సోదరుడు భాను పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రదీప్‌ను పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు అదుపులోకి తీసుకున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు