ఊచకోత కోస్తున్న హమాస్ కు ఇజ్రాయెల్ మహిళ సపోర్ట్.. షాకింగ్ వీడియో వైరల్..!! ‘నన్ను విడిపించండి ప్లీజ్’.. హమాస్ చెరలో బందీగా ఉన్న ఓ ఇజ్రాయెల్ మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఆమె చేతికి కట్టు కన్పించింది. తీవ్ర గాయంతో బాధపడుతూ కన్పించింది ఆ మహిళ. ప్రస్తుతానికి తాను బాగానే ఉన్నానని చెప్పింది. అయితే, వీలైంనంత త్వరగా తనను హమాస్ చెరలో నుంచి విడిపించాలని ఇజ్రాయెల్ సర్కార్ ను వేడుకుంది. కాగా, కేవలం ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచేందుకు హమాస్ మిలిటరీ విభాగమైన ఇజ్ అద్-దిన్ అల్-కస్సామ్ బ్రిగేడ్స్ ఈ వీడియోను టెలిగ్రామ్‌లో విడుదల చేసినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 17 Oct 2023 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Israel -Hamas War: ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న పోరు పదో రోజుకు చేరుకుంది. తమపై దాడి చేసిన గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భీకర యుద్ధం ప్రకటించింది. దీంతో గాజా నగరం కుప్పకూలుతోంది. ఇజ్రాయెల్ దాడిలో గాజాలో ఇప్పటి వరకు 2,750 మంది ప్రాణాలు కోల్పోయారని, 9,700 మంది గాయాలపాలయ్యారని స్థానిక ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొదట్లో ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసిన హమాస్ దాదాపు 200 మందిని బందీలుగా పట్టుకుంది. ఈ కారణంగానే ఇజ్రాయెల్ గాజాపై భీకర దాడి చేస్తోంది. తాజాగా ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచేందుకు హమాస్ మిలిటరీ విభాగమైన ఇజ్ అద్-దిన్ అల్-కస్సామ్ బ్రిగేడ్స్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో 21 ఏళ్ల ఫ్రాన్స్-ఇజ్రాయెల్ మహిళ మియా షెమ్ చేతికి సర్జరీ జరగ్గా.. ఓ వ్యక్తి ఆమెకు కట్టు కడుతున్నారు. ఆ తర్వాత మియా మాట్లాడింది. ‘‘నా పేరు మియా. మాది గాజా సరిహద్దులోని షోహమ్ అనే ప్రాంతం. ప్రస్తుతం నేను గాజా (Gaza)లో ఉన్నాను. అక్టోబరు 7 నేను రీమ్ కిబుట్జ్‌లో జరిగిన సూపర్‌నోవా మ్యూజిక్ పార్టీకి వెళ్లా. నా చేతికి తీవ్ర గాయమైంది. గాజాలో నాకు మూడు గంటల పాటు సర్జరీ జరిగింది. వాళ్లు నన్ను బాగానే చూసుకుంటున్నారు. మందులు ఇస్తున్నారు. నేను అడుగుతున్నది ఒక్కటే.. వీలైనంత త్వరగా నన్ను ఇక్కడి నుంచి విడిపించండి. మా అమ్మనాన్నల దగ్గరకు తీసుకెళ్లండి’’ అని మియా ఆ వీడియోలో వేడుకొంది. అయితే, ఆమె ఎలా గాయపడిందో మాత్రం మియా ఆ వీడియోలో వివరించ లేదు. #BREAKING Hamas releases what is claimed to be first footage of an Israeli hostage Hamas psychological warfare? Mia Shem, 21 years old from Shoham said: "They are taking care of me... I only ask that you get me out of here as soon as possible. Please.” Here's the full story:… pic.twitter.com/0gN3xJu6ow — The Jerusalem Post (@Jerusalem_Post) October 16, 2023 ఇజ్రాయెల్ పౌరులపై హమాస్ మిలిటెంట్లు పాల్పడిన మారణహోమంతో వారిపై వ్యతిరేకత పెరుగుతున్న వేళ.. ఈ వీడియో బయటకు రావడం చర్చనీయాంశంగా మారుతోంది. అసలు మియా ఎందుకు హమాస్ పై అంత పాజీటివ్ గా మాట్లాడింది. కనిపించిన ప్రతి ఒక్కరిని అంత క్రూరంగా చిన్న పెద్ద లేకుండా చంపుకుంటూ వెళ్తున్న వీడియోలు చూస్తునే ఉన్నాం అలాంటిది హమాస్ ఉగ్రవాదులు తనను బాగా చూసుకుంటున్నారు అని చెప్పడం ఏంటని పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కావాలనే తనతో అలా అబద్దం చెప్పించారంటూ ఇజ్రాయెలీయులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా.. హమాస్ చెరలో దాదాపు 200 మంది బందీలుగా ఉన్నట్లు ఐడీఎఫ్ ఇటీవల అధికారికంగా ప్రకటించింది. హమాస్ నెట్‌వర్క్‌ను ఛేదించి.. బందీలను విడిపించేందుకు గాజాలో గ్రౌండ్ ఆపరేషన్‌కు సిద్ధమైంది. #hamas-vs-israel మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి