TS: అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి.. ఇరువర్గాల మధ్య తోపులాట..!

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో దారుణం చోటుచేసుకుంది. అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి చెందింది. తన భార్య గుండెపోటుతో మృతి చెందిందంటున్నాడు భర్త అవినాష్‌. అయితే, కట్నం కోసం వేధిస్తూ తమ కుమార్తెను అల్లుడే చంపాడంటున్నారు బాధిత తల్లిదండ్రులు.

New Update
TS: అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి.. ఇరువర్గాల మధ్య తోపులాట..!

Khammam: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో దారుణం చోటుచేసుకుంది. అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి చెందింది. ఫోన్‌ మాట్లాడుతూనే ఒక్కసారిగా కుప్పకూలింది. ఆస్పత్రికి తరలిస్తుండగా తన భార్య గుండెపోటుతో మృతి చెందిందంటున్నాడు భర్త అవినాష్‌. పదేళ్ల క్రితం సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయికి చెందిన విజయతో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి సదాశివపురానికి చెందిన అవినాష్‌తో వివాహం జరిగింది.

Also Read: టీడీపీలో మరోసారి బయటపడ్డ వర్గ విభేదాలు..!

అయితే, కట్నం కోసం వేధిస్తూ తమ కుమార్తెను అల్లుడే చంపాడంటున్నారు బాధిత తల్లిదండ్రులు. తమ కుమార్తె మృతిపై విచారణ జరిపించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె మృతికి అల్లుడు అవినాషే కారణంటూ ఆందోళన చేపట్టారు. అవినాష్‌ కుటుంబసభ్యులతో వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. అవినాష్‌ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు