అనగనగా ఓ గ్రామం.. అభివృద్ధికి దూరం!

ప్రకాశం జిల్లాలో ఓ గ్రామం అభివృద్ధి దూరంగా ఉంటోంది. కనిగిరి నియోజకవర్గంలోని ఈ గ్రామంలో ఎవరూ సెల్ ఫోన్ వాడరు. పురాతన పాత పద్దతుల్నే వాడుతూ ఇక్కడివారి జీవనం కొనసాగుతుంటుంది. ఈ ఊరిపేరు తుంగూడు.

New Update
అనగనగా ఓ గ్రామం.. అభివృద్ధికి దూరం!

A village of basic amenities

పశ్చిమ ప్రకాశం ప్రాంతంలోని ఈ గ్రామం మౌలిక సదుపాయాలకు దూరం అయిందనే చెప్పాలి. కనిగిరి నియోజకవర్గం సిఎస్ పురం మండలం తుంగూడు గ్రామ ప్రజల వారి జీవన విధానం వారు జీవిస్తున్న ప్రాంతం చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోక తప్పదు. 35 కుటుంబాల నుంచి 40 కుటుంబాలు ఈ ప్రాంతంలో జీవిస్తున్న ఆధునిక వసతులకు, సాంకేతిక పరిజ్ఞానాని వాసన చూడని వారిగా మిగిలిపోయారు. స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా అభివృద్ధి చెందని గ్రామాలు ఉన్నాయని ఈ గ్రామాన్ని చూస్తే మనం కచ్చితంగా ఒప్పుకోక తప్పదు..

బస్సు సర్వీసులు లేవు

తుంగూడు గ్రామస్తులు వాస్తవానికి కనిగిరి నియోజకవర్గంలో జీవనం సాగిస్తున్న గిద్దలూరు నియోజకవర్గం వీరికి కూతవేటు దూరంలోనే ఉంది. బేస్తవారిపేట మండలం కొనపల్లె గ్రామం వీరికి చాలా దగ్గరగా ఉంది.వీరికి ఏ అవసరం వచ్చినా మొదట కంభం,బేస్తవారిపేట ప్రాంతాలకు వెళ్లి తమ అవసరాలను తీర్చుకుంటరు. వీరు సిఎస్ పురం గ్రామానికి వెళ్లేందుకు వీరు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిందే. గతంలో వీరికి కంభం ప్రాంతం నుండి ఉదయం,సాయంత్రం ఓ ట్రిప్ ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉండేది. కరోనా మొదటి వే లాక్ డౌన్ సమయంలో ఉన్న ఒక్క బస్సు సర్వీసు నిలిపివేశారు.గతంలో ఉన్న ఆర్టిసి బస్సు సర్వీసు ద్వారా ఈ గ్రామస్తులు వారి పిల్లల విద్య, వైద్యం వారికి కావలసిన మౌలిక సదుపాయాలు సమకూర్చుకునేందుకు ఉపయోగపడుతూ ఉండేది ప్రస్తుతం ఆ ఒక్క బస్సు కూడా రాకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి. ఇక ఈ గ్రామస్తులకు వైద్య సహాయం అవసరమైతే కంభం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళవలసిందే.అత్యవసర సమయంలో 108 వాహనానికి ఫోన్ చేయాలన్నా ఆరు కిలోమీటర్లు నడిచి బేస్తవారిపేట మండలం కొన పల్లె గ్రామ సమీపానికి వెళ్లి 108 వాహనానికి సమాచారం అందించాల్సిన పరిస్థితి.

అభివృద్ధి శూన్యం

ఇక సర్కారు అందిస్తున్న రేషన్ బియ్యాన్ని కూడా తీసుకోవాలన్న వీరు 4 నుంచి 6 కిలోమీటర్ల నడవ వలసిందే. ఈ ప్రాంతంలో మొబైల్ నెట్వర్క్ కమ్యూనికేషన్ లేకపోవడంతో ఆ సౌకర్యం ఉన్న బేస్తవారిపేట ప్రాంతానికి వెళ్లి వేలి ముద్రలు వేసి రేషన్ పొందాల్సిందే.ఇలా ఈ గ్రామస్తులకు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మౌలిక సదుపాయాల కోసం దశాబ్దాలుగా ఆపసోపాలు పడుతూనే ఉన్నారు.ఇక ఈ గ్రామంలో ఇప్పటికీ చాలా మేరకు పూరి గుడిసెల దర్శనమిస్తాయి. గ్రామంలో ఐదో తరగతి వరకు చదువుకునేందుకు వెసులుబాటు ఉన్న ఆ పై చదువులు చదవాలి అంటే వీరు ఇతర ప్రాంతాలకు వెళ్లక తప్పదు.ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు తమ పిల్లల్ని అటు సిఎస్ పురం కానీ లేదా ఇటు బేస్తవారిపేట,కంభం కానీ పంపించవలసిందే అంటున్నారు ఆ గ్రామస్తులు, రోజు వెళ్లి వచ్చేందుకు వాహన సదుపాయం లేకపోవడంతో వారి పిల్లల్ని హాస్టల్స్ లో ఉంచి చదివిస్తున్నామంటున్నారు.వీరు గిద్దలూరు నియోజక వర్గానికి 50 కిలోమీటర్లు కనిగిరి నియోజకవర్గానికి 65 కిలోమీటర్లు దూరంలో జీవనం సాగిస్తున్నారు. మౌలిక సదుపాయాల కోసం కంభం, బేస్తవారిపేట ప్రాంతాలకు వెళ్లాలంటే 40 కిలోమీటర్లు దూరం ఉండగా సిఎ పురం గ్రామానికి వెళ్లేందుకు 40 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సిందే.ఈ రెండు నియోజకవర్గాలకు చిట్ట చివర ఉండటం అందులో చుట్టూ కొండలు అటవీ ప్రాంతంలో ఉండటం మా గ్రామాన్ని ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని,మా గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని తుంగూడు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము కనిగిరి నియోజకవర్గం లోనే ఉన్నా మా మౌలిక సదుపాయాల కోసం గిద్దలూరు నియోజక వర్గం వైపే ఎక్కువగా మొగ్గు చూపుతుంటం అంటున్నారు.

ప్రభుత్వాలు గుర్తించాలి

సాంకేతిక పరిజ్ఞానం పుంతలు తొక్కుతున్న నేటి కాలంలో ఎన్నో వింతలు, విశేషాలు చూస్తూనే ఉన్నాం.టెక్నాలజీలో ఎంతో ముందుకు దూసుకు వెళ్తున్నాం అని ఊదరగొడుతున్నారు ప్రభుత్వాలు ఇలాంటి గ్రామాలను చూసైనా ఇంకా వెనుకబడే ఉన్నామని ఆలోచిస్తారేమో.మౌలిక సదుపాయాలకు నోచుకోని ఇలాంటి గ్రామాలను అధికార ప్రభుత్వం గుర్తిస్తాయని, అభివృద్ధి చేస్తాయని ప్రతి ఒక్కరం ఆశిద్దాం.

Advertisment
Advertisment
తాజా కథనాలు