హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. పెట్ బషీరాబాద్ లో వీధి కుక్కతో దాడిలో బాలిక మృతి చెందింది. నిన్న వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ రెండేళ్ల బాలిక దీపాళి.. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా విషాద ఛాయలు నింపింది.
Dogs Attack On Two Year Old Girl: హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. పెట్ బషీరాబాద్ లో వీధి కుక్కతో దాడిలో బాలిక మృతి చెందింది. నిన్న వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ రెండేళ్ల బాలిక దీపాళి.. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా విషాద ఛాయలు నింపింది. రెండేళ్ల కూతురు కళ్ల ముందే చనిపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇది ముమ్మాటికి అధికారుల నిర్లక్ష్యమే అని అక్కడి స్థానికులు ఫైర్ అవుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాగా ఈ మధ్య కాలంలో హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ వీధి కుక్కల దాడులు పెరుగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ నగరంలో కుక్కల దాడిలో ఏడు నెలల చిన్నారి మృతి చెందింది.
వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. రేపాకపల్లికి చెందిన మొండయ్య కోడలిపై మోజుతో కొడుకు ఓదెలును రోకలిబండతో కొట్టి చంపాడు. అనంతరం ఇంటినుంచి పారిపోగా పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. ఓదెలు 108 అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు.
TG Crime: తెలంగాణలో మరో దారుణం జరిగింది. కోడలుపై మోజుతో కనిపెంచిన తండ్రే కొడుకును లేపేశాడు. తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించవద్దని హెచ్చరించినందుకు కుమారిడిపై దారుణానికి పాల్పడ్డాడు. రోకలి బండతో కొట్టి కొట్టి చంపాడు. ఈ దారుణమైన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేపాకపల్లిలో జరగగా ఘటను సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కోడలితో అసభ్య ప్రవర్తన..
ఈ మేరకు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రేపాకపల్లికి చెందిన కాసం ఓదెలు(35), తన భార్య, కొడుకు(2)తో కలిసి తల్లిదండ్రులు సారక్క, మొండయ్యలతో కలిసి నివసిస్తున్నాడు. ఓదెలు 108 అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా 14 ఏళ్ల కిందట పెళ్లైంది. అయితే కొంతకాలంగా మొండయ్య ప్రవర్తన సరిగా లేకపోవడంతో గొడవలు జరుగుతున్నాయి. మొండయ్య కోడలితో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా బంధువులు పంచాయితీ పెట్టి హెచ్చరించారు. అయినా మారని మొండయ్య అలాగే ప్రవర్తిస్తున్నాడు. అయితే సోమవారం ఓదెలు తమ పెళ్లిరోజు వేడుకలు జరుపుకున్నాడు. అప్పుడు తాగి ఇంటికొచ్చి తండ్రి మొండయ్య కొడుకుతో గొడవపడ్డాడు.
ఎప్పటినుంచో పగతో రగిలిపోతున్న మొండయ్య కొడుకును చంపాలని ఎదురుచూస్తున్నాడు. ఇందులో భాగంగానే మంగళవారం తెల్లవారుజామున ఇంటి ముందు పడుకున్న కొడుకు ఓదెలు తలపై రోకలి బండతో కొట్టాడు. దీంతో తీవ్ర గాయమైన ఓదెలు అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం మొండయ్య పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు చెప్పిన భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, చిట్యాల సీఐ మల్లేశ్, ఎస్సై సందీప్‌కుమార్ తెలిపారు.