Medchal road accident: మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. విద్యార్థిని  హర్షిత కాళ్లపైనుంచి వెళ్లిన లారీ

పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ యంనంపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.శ్రీనిధి కాలేజ్ బీటెక్ విద్యార్థిని హర్షిత ఎగ్జామ్ రాసి తిరిగి వస్తుండగా అతివేగంతో వెళ్తోన్న లారీ హర్షితను ఢీకొట్టడంతో అక్కడికక్కడే పడిపోయిన హర్షిత కాళ్లపై నుంచి లారీ వెళ్లిపోయింది.

New Update
Medchal road accident: మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..  విద్యార్థిని  హర్షిత కాళ్లపైనుంచి వెళ్లిన లారీ

Medchal road accident : మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో హర్షిత (20) అనే విద్యార్థిని  తీవ్ర గాయాలపాలయి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

హర్షిత కాళ్లపై నుంచి వెళ్లిన లారీ 

శ్రీనిధి కళాశాల బీటెక్ సెకండియర్ చదువుతున్న హర్షిత అనే విద్యార్థిని ఎగ్జామ్ రాసి తిరిగి వస్తుండగా..అతివేగంతో వెళ్తోన్న లారీ హర్షితను ఢీకొట్టడంతో అక్కడికక్కడే పడిపోయిన హర్షిత కాళ్లపై నుంచి వెళ్లిపోయింది.మేడ్చల్ జిల్లా..పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ యంనంపేట వద్ద జరిగిన ఈ ప్రమాదంలో హర్షిత పరిస్థితి విషమించడంతో శ్రీకర ఆసుపత్రికి తరలించారు.లారీ TS39T3949ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించి .. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది దుర్మరణం

మితిమీరిన వేగం కారణం

రోడ్డు ప్రమాదాలు జరగకుండా అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే.. మితి మీరిన వేగంతో వస్తోన్న వాహనాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.ముఖ్యంగా నగర శివార్లల్లో ఇంజనీరింగ్ కళాశాలలు ఎక్కువగా ఉండటంతో విద్యార్థులతో ఆ ప్రాంతాలన్నీ కిటకిట లాడుతూ ఉంటాయి. అయినా సరే .. సరైన ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా మితి మీరిన వేగంతో వస్తోన్న ప్రయివేట్ వాహనాలు బంగారు భవిష్యత్ ఉన్న విద్యార్డుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. గతంలో మేడ్చల్ జిల్లాలోనే కీసర చౌరస్తా దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విద్యార్థులు మృతి చెందిన విషయం ఇంకా మరువకముందే మల్లీ ఈ ఘటన జరగడం చాలా బాదాకరం. ఇప్పటికైనా నగర శివారు ప్రాంతాలు , ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్న ప్రాంతాల్లో  స్పీడ్ నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Also Read:హైదరాబాద్‌లో మరో హిట్‌ అండ్‌ రన్‌ కేసు

Advertisment
Advertisment
తాజా కథనాలు