హోంవర్క్ చేయని ఓ స్టూడెంట్ కిడ్నాప్ డ్రామా ప్లే చేసి..చివరకు అడ్డంగా బుక్కయ్యాడు..!!

హోమ్ వర్క్ చేయని ఓ స్టూడెంట్ టీచర్ పనిష్మెంట్ నుంచి తప్పించుకోవడానికి.. ఏకంగా ఓ క్రైం సీన్ కే స్కెచ్ వేశాడు. ఆ స్కెచ్ తో తల్లిదండ్రులు టెన్షన్ పడితే..కాప్స్ కు మైండ్ బ్లాక్ అయింది. కాని చివరికి సీసీ టీవీ ఫుటేజీ బుడ్డోడిని అడ్డంగా బుక్ చేసింది. దీంతో వీడు మామూలోడు కాదని అందరూ ముక్కన వేలు వేసుకున్నారు.

New Update
హోంవర్క్ చేయని ఓ స్టూడెంట్ కిడ్నాప్ డ్రామా ప్లే చేసి..చివరకు అడ్డంగా బుక్కయ్యాడు..!!

హోమ్ వర్క్ చేయని పిల్లలు నెక్ట్స్ డే స్కూల్ కి డుమ్మా కొట్టడానికి చేసే ప్రయత్నాలు.. చెప్పే సాకులు అన్నీ ఇన్నీ కావు. కడుపు నొప్పి అనో.. లేక తలనొప్పి అనో పేరెంట్స్ ను గాబరా పెట్టించి స్కూల్ బంక్ కొట్టేస్తారు. ఇక పిల్లల వేస్తున్న వేషాలు పసిగట్టి తల్లిదండ్రులు బలవంతంగా స్కూల్ కి పంపిస్తే.. అక్కడ టీచర్ ముందు డ్రామాలు ప్లే చేస్తారు. కరెంట్ లేదనో..హెల్త్ బాలేదనో చెప్పి పనిష్మెంట్ నుంచి తప్పించుకుంటుంటారు. ఇలాంటి అనుభవాలు మనలో చాలా మందికే ఉంటాయి.

అయితే ఓ బుడతడు మాత్రం ఇవన్నీ సో కామన్ అని.. టీచర్ పనిష్మెంట్ నుంచి తప్పించుకోవడానికి ఏకంగా ఓ క్రైం సీన్ కే స్కెచ్ వేశాడు. ఆ స్కెచ్ తో తల్లిదండ్రులు టెన్షన్ పడితే..కాప్స్ కు మైండ్ బ్లాక్ అయింది. కాని చివరికి సీసీ టీవీ ఫుటేజీ బుడ్డోడిని అడ్డంగా బుక్ చేసింది. దీంతో వీడు మామూలోడు కాదని అందరూ ముక్కన వేలు వేసుకున్నారు. ఇక వివరాల్లోకి వెళితే.. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్ పూర్ లోని కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

బిలార్ పూర్ కు చెందిన ఓ విద్యార్థి టీచర్ ఇచ్చిన హోం వర్క్ చేయలేదు. దీంతో స్కూల్ కెళితే.. పనిష్మెంట్ తప్పదని కిడ్నాప్ డ్రామా ప్లే చేశాడు. తాను స్కూల్ కు వెళుతున్న దారిలో ఇద్దరు ముసుగు ధరించిన యువకులు తన దగ్గరకు వచ్చి మత్తు పదార్ధాన్ని తన ముక్క దగ్గర పెట్టడంతో తాను స్పృహ కోల్పోయానని తల్లిదండ్రులకు చెప్పాడు. తరువాత బైక్ పై తనను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని అయితే ట్రాఫిక్ జామ్ లో బైక్ ఆగిందని.. అప్పుడే తనకు నెమ్మదిగా స్పృహ వచ్చందని.. దీంతో తాను వారి నుంచి తప్పించుకున్నానని అన్నాడు. ఇక ఇది విన్న స్టూడెండ్ తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు. తమ కుమారుడ్ని ఎవరో కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని పోలీసు స్టేషన్ కు పరుగులు తీశారు. కోట్ పోలీసు స్టేషన్లో కంప్లైంట్ చేశారు.

దీంతో దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అయితే పిల్లాడు చెబుతున్న రూట్లో సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా అతడు చెబుతుందంతా ఫేక్ అని తేలింది. ఇక అక్కడే ఉన్న పిల్లాడిని గట్టిగా పోలీసులు అడగ్గా.. అతడు బాంబ్ పేల్చాడు. హోం వర్క్ చేయలేదని.. టీచర్ పనిష్మెంట్ ఇస్తుందనే.. ఇలా కిడ్నాప్ డ్రామా ఆడానని చెప్పాడు. దీంతో అక్కడున్న వారందరికి దిమ్మ తిరిగింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు