TS: పాపం.. విద్యార్థి.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఘోర అవమానం..!

మహబూబాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ విద్యార్థికి అవమానం జరిగింది. జమాండ్లపల్లి ఎస్టీ గురుకులంలో ఉపాధ్యాయుల ఆదేశంతో ఓ విద్యార్థి బట్టలు విప్పి కేవలం డ్రాయర్ పై నిల్చొని గోడకు సున్నం వేశాడు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

New Update
TS: పాపం.. విద్యార్థి.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఘోర అవమానం..!

Mahabubabad: ఇండిపెండెన్స్ డే అంటే విద్యార్థులు చక్కగా రెడీ అయి ఎప్పుడు లేనంత సంతోషంగా, హుషారుగా స్కూల్ కు వెళ్తారు. మన దేశానికి స్వాతంత్య్రం ఎలా వచ్చింది? ఎవరెవరూ పోరాడారు? లాంటి విషయాలను ఉపాధ్యాయులు పిల్లలకు వివరిస్తారు. అయితే, ఓ ఉపాధ్యాయుడు మాత్రం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ విద్యార్థిని దారుణంగా అవమానించాడు. పనివాళ్ళతో చేయించాల్సిన పనులు విద్యార్థితో చేయించాడు.

Also Read: డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే.. షెడ్యూల్ ఇదే..!

అసలేం జరిగిందంటే? మహబూబాబాద్ జిల్లా జమాండ్లపల్లి ఎస్టీ గురుకులంలో.. సార్ చెప్పాడని ఓ విద్యార్థి బట్టలు లేకుండా గోడకు సున్నం వేశాడు. నిన్న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో విద్యార్థి సంఘాలు ఆ ఉపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థులను చదివించడానికి హాస్టల్ లో పెడితే వారితో ఇలాంటి పనులు చేయిస్తారా? అంటూ మండిపడుతున్నారు. బాధ్యుడిపై తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాnr.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఎంతకు తెగించావమ్మా.. భర్తపై కోపంతో 5 నెలల బిడ్డను నీటిలో ముంచి చంపేసింది!

తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. పుదుకోట్లై జిల్లాకు చెందిన మణికంఠన్ , లావణ్య దంపతులకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో లావణ్య భర్తపై కోపాన్ని బిడ్డపై తీర్చుకుంది. 5నెలల పసిబిడ్డను డ్రమ్ము నీటిలో ముంచి చంపేసింది.

New Update
Tamil Nadu incident mother killed 5 months baby

Tamil Nadu incident mother killed 5 months baby

తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. పుదుకోట్లై జిల్లాకు చెందిన మణికంఠన్ , లావణ్య దంపతులకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో లావణ్య భర్తపై కోపాన్ని బిడ్డపై తీర్చుకుంది. 5నెలల పసిబిడ్డను డ్రమ్ము నీటిలో ముంచి చంపేసింది. ఆ తర్వాత దొంగలు తన మెడలో బంగారు లాకెళ్లి బిడ్డను ఎత్తుకెళ్లారని కట్టు కథ అల్లింది. భర్త తనతో కాకుండా బిడ్డ పై ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడని తట్టుకోలేక ఆమె ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 

telugu-news | latest-news | crime | tamil-nadu
Advertisment
Advertisment
Advertisment