Ananthapuram: రాయదుర్గంలో వింత ఆచారం.. దేవుడికి బాలికతో నిశ్చితార్థం..! అనంతపురం జిల్లా రాయదుర్గంలో వింత ఆచారం వెలుగులోకి వచ్చింది. దేవుడికి బాలికతో నిశ్చితార్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొన్ని ఏళ్లుగా సాంప్రదాయకంగా కొనసాగుతున్న ఆచారం అంటున్నారు స్థానిక పురోహితులు. By Jyoshna Sappogula 21 May 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి Ananthapuram: అనంతపురం జిల్లా రాయదుర్గంలో వింత ఆచారం వెలుగులోకి వచ్చింది. దేవుడికి బాలికతో నిశ్చితార్థం జరిపిస్తున్నారు. వింత ఆచారమే అయినప్పటికీ కొన్ని ఏళ్లుగా సాంప్రదాయకంగా కొనసాగుతున్న ఆచారం అంటున్నారు స్థానిక పురోహితులు. రాయదుర్గం పట్టణం కోటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా శ్రీవారి కల్యాణోత్సవంలో బాలికతో స్వామివారికి పెళ్లి తంతు జరిపించడం 70 ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయమన్నారు. Also Read: నటి హేమ కొత్త వీడియో.. ఇదంతా కవరింగే అంటూ ట్రోలింగ్..! అందులో భాగంగానే బళ్లారి రోడ్డులోని భక్త మార్కండేయ స్వామి ఆలయంలో పద్మశాలీయుల్లో అరవ కులానికి చెందిన మౌనికతో నేడు నిశ్చితార్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలిక తల్లిదండ్రులు, పురోహితులు, ఆలయ ఈవో, పెద్దల సమక్షంలో నిశ్చితార్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. 25వ తేదీన వైభవంగా శ్రీవారి కల్యాణోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. #ananthapuram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి