Snake: ఆసుపత్రికి వెళ్లిన పేషెంట్.. స్కానింగ్ రూమ్‌లో పసిరిక పాము..

అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ స్కానింగ్ రూమ్‌లో పసిరిక పాము దర్శనమిచ్చింది. స్కానింగ్ కోసం వచ్చిన పేషెంట్‌ కిటికీపై ఉన్న పసిరిక పామును చూసి వెంటనే వైద్య సిబ్బందికి తెలిపింది. దీంతో అలర్ట్ అయిన సిబ్బంది పామును కొట్టి బయటపడేయంతో పేషెంట్లు ఊపిరి పీల్చుకున్నారు.

New Update
Snake: ఆసుపత్రికి వెళ్లిన పేషెంట్.. స్కానింగ్ రూమ్‌లో పసిరిక పాము..

Snake Found in Scanning Room: అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ లో (NTR Hospital) ఓ పేషెంట్ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లింది. డాక్టర్ స్కానింగ్ చేయాలని అనడంతో స్కానింగ్ రూమ్‌లో వెళ్లింది. అయితే, ఆ రూమ్ లో పసిరిక పాము దర్శనమిచ్చింది. కిటికీపై ఉన్న పసిరిక పామును చూసి వెంటనే షాక్ అయింది. వెంటనే వైద్య సిబ్బందికి తెలిపింది. దీంతో అలర్ట్ అయిన సిబ్బంది పామును కొట్టి బయటపడేయంతో పేషెంట్లు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime: కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !

విశాఖలో గర్భిణీ అనూష హత్య కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడించారు. జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకుని 2022లో సింహాచలంలో వివాహం చేసుకున్నారు. అనూషను వదిలించుకోవాలని జ్ఞానేశ్వర్ కొన్నాళ్లుగా చూస్తున్నాడని పోలీసులు విచారణలో తేలింది

New Update

AP Crime: విశాఖలో గర్భిణీ అనూషను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడించారు. జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకుని 2022లో సింహాచలంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. నిందితుడు హిందూస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. పోలీసుల విచారణ ప్రకారం.. పీఎం పాలెం పీఎస్‌ పరిధిలో గర్భిణీ అనూష హత్య ఘటనలో ఏసీపీ అప్పలరాజు సంచలన విషయాలు తెలిపారు. అనూషను వదిలించుకోవాలని జ్ఞానేశ్వర్ కొన్నాళ్లుగా చూస్తున్నాడని పోలీసులు విచారణలో తెలింది. ఈ క్రమంలోనే జ్ఞానేశ్వర్ పలు నాటకాలు ఆడిన్నారు. ముందు తనకు క్యాన్సర్ ఉందని, వేరే పెళ్లి చేసుకోవాలని అనూషపై జ్ఞానేశ్వర్ ఒత్తిడి చేశాడు.

గతంలో చంపడానికి ప్లాన్..

ఆమె అంగీకరించకపోవడంతో మరో నాటకం ఆడాడు. తనకు పెళ్లైనట్లు తల్లిదండ్రులకు తెలియదని, వారికి తెలిస్తే ఇద్దరినీ చంపేస్తారని అనూషకు చెప్పాడు. అందుకే.. విడాకులు తీసుకుందామని ఒత్తిడి చేశాడు. ఆ ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో అనూషను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. జ్ఞానేశ్వర్ భార్యను బయటకు తీసుకువెళ్లినా సరదాగా మెలిగేవాడు కాదని, జంటగా ఫొటోలు దిగుదామన్నా వద్దనేవాడు స్నేహితులు చెబుతున్నారు. గతంలో పలుమార్లు చంపడానికి ప్రయత్నించాడు. ఫలుదాలో టాబ్లెట్స్ కలిపి చంపాలని ఫ్లాన్‌ చేశాడు. జ్ఞానేశ్వర్ డెలివరీ ఉందని ఫ్రెండ్స్‌ అందరికీ వీడియో కాల్‌ చేశాడు.
 
ఇది కూడా చదవండి: రోజూ ఉదయాన్నే నిమ్మకాయ నీళ్లు తాగితే ఇవే లాభాలు

రాత్రికి రాత్రి అనూషను చున్నీతో చంపేశాడు. జ్ఞానేశ్వర్ ముఖంపై గోర్లతో రెక్కేసిన ఆనవాలు ఉన్నట్లు బాధితురాలి స్నేహితులు పోలీసుల విచారణలో తెలిపారు. అయితే.. మంగళవారం డెలివరీ ఉండగా.. సోమవారం రాత్రే ఆమెను హతమార్చాడు. ఏమీ తెలియనట్లు మళ్లీ పడుకున్నాడు. ఉదయం బంధువులు లేపినా.. అనూష లేవలేదు. వారితోపాటే అతనూ నిద్ర లేపుతున్నట్లు నటించాడు. దీంతో జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నామని.. తనను అనుమానించడంతోనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని ఏసీపీ అప్పలరాజు తెలిపారు. పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నిందితుడిపై హత్య నేరం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.   

ఇది కూడా చదవండి: క్లీన్ షేవ్, గడ్డం.. చర్మానికి ఏది మంచిదో తెలుసా?

( AP Crime | ap-crime-news | ap-crime-report | ap crime updates | ap crime latest updates )

Advertisment
Advertisment
Advertisment