కేసీఆర్‌కు షాక్‌.. కాంగ్రెస్‌లోకి క్యూ కట్టిన బీఆర్ఎస్‌ నాయకులు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నవేళ టీకాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు పలువురు బీఆర్ఎస్‌ నాయకులు. ఇల్లందు నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్‌ నుంచి పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు జరిగాయి.

New Update
కేసీఆర్‌కు షాక్‌.. కాంగ్రెస్‌లోకి క్యూ కట్టిన బీఆర్ఎస్‌ నాయకులు

A shock to BRS..Illandu constituency leaders joined Congress

పార్టీలోకి ఆహ్వానం

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో ఇల్లందు నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్‌రెడ్డి కండువాలతో ఆహ్వానించారు. ఇల్లందు నియోజకవర్గ నేతలు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు కలసికట్టుగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కరెంట్ వివాదం

ఇక ఉచిత విద్యుత్‌ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలిసిందే.. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ విష ప్రచారం చేస్తుందని మంత్రి కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్‌ నాయకులు ఆరోపించిన విషయం తెలిసిందే. కరెంట్ విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉచిత విద్యుత్‌పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై... కాంగ్రెస్ సీనియర్లు స్పందించకపోవడం శోచనీయమన్నారు. రేవంత్‌ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, రైతులకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. నిన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ నివాసంలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్... రేవంత్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. ఐదు దశాబ్దాలుగా తెలంగాణ రైతాంగానికి సాగునీరు, ఎరువులు ఇవ్వకుండా, ప్రాజెక్టులు నిర్మించకుండా కాంగ్రెస్‌ మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ పాలనలో రైతులకు మేలు జరుగుతుంటే కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుందని కేటీఆర్ మండిపడిన విషయం తెలిసిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు