T20 WORLD CUP: సిక్సుల వీరుడికి అరుదైన గౌరవం!

భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌కు అరుదైన గౌరవం దక్కింది.ఈ ఏడాది జూన్ లో జరగనున్న టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీకి యూవీ అంబాసిడర్‌గా ఎంపిక అయ్యాడు. ఈ మెగా టోర్నీకి ముందు అమెరికాలో నిర్వహించే పలు ప్రమోషన్‌ ఈవెంట్లలో యువరాజ్‌ సింగ్ పాల్గొననున్నాడు.

New Update
T20 WORLD CUP: సిక్సుల వీరుడికి అరుదైన గౌరవం!

భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది జూన్‌లో జరగబోయే టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీకి యూవీ అంబాసిడర్‌గా ఎంపిక అయ్యాడు. ఈ మెగా టోర్నీకి ముందు అమెరికాలో నిర్వహించే పలు ప్రమోషన్‌ ఈవెంట్లలో యువరాజ్‌ సింగ్ పాల్గొననున్నాడు. టీ20 వరల్డ్‌ కప్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపిక అవ్వడం పట్ల యువరాజ్‌సింగ్‌ సంతోషం వ్యక్తం చేశాడు. టీ20 వరల్డ్‌ కప్‌లోనే తాను అద్భుతమైన జ్ఞాపకాలు పోగు చేసుకున్నానని యువరాజ్‌ సింగ్‌ అన్నాడు.

టీ20 వరల్డ్‌ కప్‌తోనే తన క్రికెట్‌ జర్నీలో మర్చిపోలేని జ్ఞాపకాలు ఉన్నాయని యువరాజ్‌ గుర్తు చేసుకున్నాడు. ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టడం ఎప్పటికీ మర్చిపోలేని సందర్భంగా మిగిలిపోయిందని అన్నాడు. ఇక అలాంటి టీ20 వరల్డ్‌ కప్‌కే బ్రాండ్‌ అంబాసిడర్‌గా కొత్త పాత్ర పోషించేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు చెప్పాడు. ఇక టీ20 క్రికెట్‌ ఆడేందుకు వెస్టిండీస్‌ గొప్ప ప్రదేశంగా యూవీ పేర్కొన్నాడు. ఇక అమెరికాలో కూడా క్రికెట్‌ విస్తరిస్తోందనీ.. న్యూయార్క్‌లో జూన్‌ 9న భారత్, పాకిస్థాన్‌ మధ్య జరగబోయే మ్యాచ్‌ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారని యూవీ చెప్పాడు. ప్రచారకర్తగా గొప్ప ఆటగాళ్లను కలుసుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు వెల్లడించాడు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP News: ఏపీలో రాజ్యసభ ఎన్నిక.. చంద్రబాబు, అమిత్ షా భేటీలో కీలక నిర్ణయం.. అభ్యర్థి ఎవరంటే?

ఏపీలో త్వరలో జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికలో కూటమి నుంచి బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగనుంది. ఈ రోజు అమిత్ షాతో చంద్రబాబు భేటీ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు బీజేపీ మీజీ చీఫ్ అన్నామలై, స్మృతీ ఇరానీలో ఒకరికి ఛాన్స్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది.

New Update
Andhra Pradesh Rajyasabha Election

విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ ఇటీవల షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం ఉన్న బలాబలాల దృష్ట్యా ఈ సీటు కూటమికే దక్కే ఛాన్స్ ఉంది. దీంతో కూటమి నుంచి ఈ సీటు కోసం ఎవరు బరిలో ఉంటారు అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. అయితే.. ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో రాజ్యసభ పోటీ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది.

టీడీపీ ఓకే..

అయితే.. బీజేపీకి ఈ సీటును ఇచ్చేందుకు కూటమిలో ప్రధాన పార్టీ అయిన టీడీపీ అంగీకరించినట్లు తెలుస్తోంది. జనసేన సైతం అందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్‌ అన్నామలై, మాజీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీలో ఒకరిని ఏపీ నుంచి రాజ్యసభకు పంపించాలన్నది బీజేపీ ప్లాన్ గా తెలుస్తోంది. 

telugu-news | telugu breaking news

Advertisment
Advertisment
Advertisment