AP: కొంపముంచిన రూ. 500 నోటు, 50 వేలు పొగొట్టుకున్నాడుగా..!

ఎన్నికల కోడ్‌ అమల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా గణపవరానికి చెందిన నరసింహమూర్తి కారును అధికారులు తనిఖీ చేశారు. రూ.50,500 నగదుని గుర్తించారు. కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో ఒక వ్యక్తి దగ్గర 50 వేలకు మించి నగదు ఉండకూడదనే నిబంధనతో మొత్తం నగదుని స్వాధీనం చేసుకున్నారు.

New Update
Best Pension Policy : నెలకు రూ. 10వేల పెన్షన్ కావాలా?అయితే ఈ స్కీంలో చేరండి..!

West Godavari: రూ.500 నోటు ఓ వ్యక్తిని నిండా ముంచేసింది. ఏకంగా అతని వద్ద ఉన్న రూ. 50 వేలు పొగుట్టుకునేలా చేసింది. ఎలా అనుకుంటున్నారా? పశ్చిమ గోదావరి జిల్లా గణపవరానికి చెందిన నరసింహమూర్తి విజయవాడకు కారులో బయలుదేరారు. అయితే, 16వ జాతీయ రహదారిపై ఎన్నికల కోడ్‌ అమల్లో భాగంగా  చెక్‌పోస్టు వద్ద అధికారులు తనిఖీలు చేశారు.

Also Read: ‘వివేకం’ సినిమాపై హైకోర్టులో విచారణ.. ఎన్నికల కమీషన్ కు కీలక ఆదేశాలు..!

ఈ క్రమంలో అతడి వద్ద రూ. 50,500 నగదు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో ఒక వ్యక్తి దగ్గర రూ. 50 వేలకు మించి నగదు ఉండకూడదనే నిబంధన ఉండడంతో, రూ.500 అదనంగా నరసింహమూర్తి వద్ద లభించడంతో మొత్తం నగదుని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాను వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఈ మొత్తంతో వెళుతున్నానని అధికారులకు వివరించారు.

Also Read: అసలేంటీ కచ్చతీవు…దాని గురించి గొడవ ఎందుకు అవుతోంది?

రూ.500 మాత్రమే ఎక్కువ ఉన్నందున తన నగదు తనకు ఇచ్చేయాలని అధికారులను కోరారు. అయితే, అందుకు తగిన ఆధారాలు చూపి నిబంధనల మేరకు తర్వాత తీసుకువెళ్లాలని చెప్పడంతో ఇక చేసేదేమి లేక అతడు వెళ్లిపోయాడు. ఇలా ఒక 500 నోటు అతడి వద్ద ఉన్న 50 వేలును పొగుట్టుకునేలా చేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు