America : భర్తతో విభేదాల కారణంగా మూడేళ్ల కుమారుడ్ని కాల్చి చంపిన తల్లి!

భర్తతో ఉన్న విభేదాల కారణంగా కొడుకును తుపాకీతో కాల్చి చంపింది ఓ మహాతల్లి. అంతేకాకుండా..తాను కూడా కాల్చుకుని చనిపోయింది. అమెరికాలోని టెక్సాస్ లో ఈ దారుణం జరిగింది.

New Update
Madanapalli: మదనపల్లిలో అర్థరాత్రి కాల్పుల కలకలం!

Mother Killed A 3 Years Old Boy : భర్త(Husband)తో ఉన్న విభేదాల కారణంగా కొడుకును తుపాకీతో కాల్చి చంపింది ఓ మహాతల్లి(Mother). అంతేకాకుండా.. తాను కూడా కాల్చుకుని చనిపోయింది. అమెరికా(America) లోని టెక్సాస్ లో ఈ దారుణం జరిగింది. వివరాల్లో కి వెళితే.. 32 ఏళ్ల సవన్నా క్రిగర్ కి తన భర్తతో కొంతకాలంగా విభేదాలు వచ్చాయి. విడాకుల(Divorce) తరువాత కొడుకు ఎవరి దగ్గర ఉండాలనే విషయం గురించి కోర్టులో కేసు నడుస్తోంది. మూడేళ్ల కొడుకు కైడెన్ కస్టడీకి సంబంధించి గురువారం చివరి హియరింగ్ ఉంది. కాగా.. క్రిగర్ బుధవారం ఉదయమే లేచిన గబగబా రెడీ అయి, కొడుకు కైడెన్ ను డే కేర్ సెంటర్ లో దింపేసింది. తాను ఆఫీస్ కు బయల్దేరింది.

అక్కడ అధికారులను కలిసి, తన జాబ్ కి సంబంధించి రిజైన్‌ లెటర్ ని ఇచ్చింది. తన క్యాబిన్ లోకి వెళ్లి, ముఖ్యమైన డాక్యుమెంట్స్, ఇతర వస్తువులు తీసుకుని ఆఫీస్ నుంచి బయటకు వచ్చింది. అక్కడి నుంచి నేరుగా తన మాజీ భర్త, గతంలో తాము కలిసి ఉన్న పాత ఇంటికి వెళ్లింది. అప్పటికే, ఫ్లాట్ కు తాళం వేసి ఆమె భర్త ఆఫీస్ కు వెళ్లిపోయాడు. దీంతో తన వద్ద ఉన్న మరో తాళంతో ఇంట్లోకి వెళ్లిన సవన్నా.. అక్కడి వస్తువులను ధ్వంసం చేసింది. ముఖ్యమైన డాక్యుమెంట్స్ ను చింపేసింది.

తమ పెళ్లి నాటి వెడ్డింగ్ గౌన్ ను బయటకు తీసి బెడ్ పై వేసి తగలపెట్టింది. ఆ తరువాత అక్కడి నుంచి డైరెక్ట్ గా తన కొడుకు ఉన్న డే కేర్ సెంటర్ కు వెళ్లి, కొడుకు కైడెన్ ను పికప్ చేసుకుంది. అక్కడ నుంచి ఇంటి సమీపంలోకి చిన్న పార్క్ లోకి వెళ్లింది. పార్క్ లో కాస్త నిర్మానుష్యంగా ఉన్న చిన్న గుంత లాంటి ప్రదేశంలోకి వెళ్లింది. ఆ తరువాత తన ఐ ఫోన్ తీసుకుని తన మాజీ భర్తకు వీడియో కాల్ చేసింది. ఫోన్ కెమెరాను తన కుమారుడి ముఖం ముందు ఉంచి.. ‘‘డాడీకి గుడ్ బై చెప్పు’’ అని చెప్పింది. తండ్రి ముఖం చూడగానే తన తల్లి ఉద్దేశం అర్థం కాని ఆ చిన్నారి నవ్వుతూ తండ్రికి వీడ్కొలు చెప్పింది.

ఆ వెంటనే, సవన్నా తన బ్యాగ్ లో నుంచి పిస్టల్ ను తీసి, తన కొడుకుకు ముద్దు పెట్టి, సారీ చెబుతూ, గురిపెట్టి కాల్చేసింది. క్షణాల్లో ఆ చిన్నారి విగతజీవిగా మారిపోయాడు. ఆ వెంటనే, తనని తాను కాల్చుకుని ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. ఇదంతా కళ్లారా చూసిన ఆ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా.. పార్క్‌ లో రెండు మృతదేహాలు లభ్యం అయ్యాయి.

Also read: పవన్ కు అండగా మెగా ఫ్యామిలీ.. ఇక వార్ వన్ సైడేనా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పాపం.. దోమల కాయిల్‌కు పసి బాలుడు బలి

రంగారెడ్డి జిల్లాలో దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు పరుపుకి దగ్గరగా కాయిల్ పెట్టారు. దీనికి కాయిల్ అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించి ఊపిరాడక నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.

New Update
MOSQUITO COIL

MOSQUITO COIL

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే హయత్ నగర్‌లో ఓ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు కాయిల్ వెలిగించారు. అది కూడా దూరంగా పెట్టకుండా పిల్లలు పడుకున్న పరుపుకి దగ్గరగానే పెట్టారు. ఆ కాయిల్ పిల్లల పరుపుకు అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ నాలుగేళ్ల బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. మరో ఐదేళ్ల బాలిక పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

అదుపు తప్పిన వ్యాన్..

ఇదిలా ఉండగా ఇటీవల హర్యానా ఫిరోజ్‌పూర్ జిర్కాలోని ఇబ్రహీం బాస్ గ్రామం సమీపంలో ఘోరం జరిగింది. రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య  కార్మికులపైకి వ్యాన్‌ దూసుకెళ్లింది. ఢిల్లీ నుంచి అల్వార్ వైపు వేగంతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపు తప్పింది. ఈ సంఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం భయంకరంగా మారింది.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

యాక్సిడెంట్ తర్వాత వ్యాన్‌ డ్రైవర్‌ దిగి అక్కడి నుంచి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారులో ఈ దుర్ఘటన శనివారం ఉదయం 10 గంటలకు చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వే మీద కొందరు పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్‌ చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయడిన కార్మికులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు