Suicide: కొడుకు కాలేజీ ఫీజ్ కట్టడానికి బస్సు కిందపడి తల్లి ఆత్మహత్య.. ఎక్కడో తెలుసా? కేరళలోని సేలంలో హృదయవిదారక ఘటన జరిగింది. ఓ తల్లి తన కోడుకు ఫీజ్ కట్టడానికి ఓ బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. రూ.45వేలు కావాలంటే బస్సు కింద పడి చనిపోతే ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని ఎవరో చెప్పిన మాయమాటలు నమ్మి ఇలా చేసింది. By Trinath 18 Jul 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి నిత్యం కూలి పని.. క్లీనింగ్ పని చేస్తూ జీవనం సాగించేవాళ్లకి పూట గడవడమే తప్ప ఆస్తులు కూడబెట్టుకోవడం తెలియదు. ఎదైనా సమస్య వస్తే అప్పో సప్పో చేయడమే కానీ మరో గతి ఉండదు. ఆ సమయంలో ఎవరైనా సాయం చేసి ఆదుకుంటే గట్టెక్కడం తప్ప గత్యంతరం లేని బతుకులు వారివి. ముఖ్యంగా పిల్లల చదువుల విషయంలో ఆ తల్లిదండ్రులు ఎంత దూరమైన వెళ్తారు. తమలాగా పిల్లలు బతుకులు ఉండకూడదని సంపాదించిందంతా వాళ్ల చదువుకే ఖర్చుచేస్తారు. అయితే ఎంత చేసినా ఇంకా చేయాల్సిందే కొంతైనా ఉంటుంది. విద్య వ్యాపారంగా మారిన కాలం కదా ఇది. అది వెనకపడ్డ రాష్ట్రాల్లోనైనా, అభివృద్ధికే రోల్‌మోడల్‌గా నిలిచే రాష్ట్రాల్లోనైనా ఇదే పరిస్థితి ఉంటుంది. తన కన్న కొడుకు కాలేజీ ఫీజ్ కొట్టడం కోసం కొంతమంది మాటలు విన్న ఓ తల్లి బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఎక్కడ జరిగిందీ ఘటన..? దేశానికి అనేక అంశల్లో రోల్‌మోడల్‌గా నిలిచే రాష్ట్రాల్లో కేరళ ఒకటి. ముఖ్యంగా విద్య విషయంలో కేరళ అందరికంటే ముందుంటుంది. అక్కడ సుదీర్ఘ కాలం పాటు పాలించిన కమ్యూనిస్ట్, కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చిన సంస్కరణలు అలాంటివి. అలాంటి కేరళలో ఓ మహిళ తన కొడుకు కాలేజీ ఫీజ్ కట్టడానికి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆత్మహత్య చేసుకుందంటే నమ్మగలరా..? మీరు నమ్మినా..నమ్మకున్నా ఇదే నిజం. జర్నలిస్ట్ అరవింద్ గుణశేఖర్ ట్విట్టర్లో తన అకౌంట్ నుంచి పోస్ట్ చేసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో యూజర్లకు కన్నీళ్లు తెప్పిస్తుంది. ఎందుకిలా చేసింది..? కేరళ సేలం కలెక్టర్ ఆఫీస్‌లో సఫాయి కార్మికరాలుగా పనిచేస్తోన్న ఓ మహిళా పట్టపగలు రోడ్డుపై ఆత్మహత్య చేసుకుంది. తన కొడుకు కాలేజీ ఫీజ్ కట్టడానికి అందరిని సాయం అడిగిన ఆమెకు ఏ ఒక్కరూ హెల్ప్ చేయకపోగా.. ఎవరో ఆ తల్లిని తప్పుదోవ పట్టించారు. రూ.45వేలు కావాలంటే ఎవరూ ఇవ్వరని.. బస్సు కింద పడి చనిపోతే ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని నమ్మబలికారు. వాళ్ల మాటలు విన్న మహిళ..చనిపోవాలని నిర్ణయించుకుంది. కొడుకు భవిష్యత్ కంటే తన జీవితం ఎక్కువ కాదని డిసైడ్ అయ్యింది. బతికి ఫీజ్ కొట్టలేకుండా ఉండిపోవడం కంటే.. చనిపోయి కొడుకు ఫీజ్ కట్టడం ఉత్తమమని భావించింది. కొడుకుపై ప్రేమతో తానేం ఆలోచిస్తున్నది కనిపెట్టలేకపోయింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఆమెకు ఒక్కసారిగా మనసంతా బరువెక్కింది.. గోంతులోనుంచి వస్తున్న ఏడుపును దిగమింగుకుంటూ..చివరిసారిగా తన కొడుకును తలచుకుంటూ ధైర్యం చేసుకొని కదులుతూ వస్తున్న బస్సు ముందుకు వెళ్లి నిలపడింది. ఆ బస్సు డ్రైవర్‌కి గమనించేంతా టైమ్ కూడా లేదు..సెకన్ వ్యవధిలో ఘోరం జరిగిపోయింది. ఆ తల్లి ఆ బస్సుకిందే ప్రాణాలు వదిలింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి