Hyderabad : అమ్మ పొత్తిళ్లలో నిద్రిస్తున్న నెల వయసు శిశువు.. వేకువజామున చూసేసరికి..! శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలో నెల వయసు శిశువు ఆపహరణకు గురైంది. కర్నూల్‌కు చెందిన పి.చిన్నా దంపతులు శంషాబాద్ పై వంతెన కింద దినసరి కార్మికులు. వీరికి ఇద్దరు చిన్నారులున్నారు. ఈ నెల 29న తల్లి పొత్తిళ్లలో పడుకున్న నెల వయసు పాప వేకువజామున చూసేసరికి కనిపించలేదు. By Jyoshna Sappogula 30 May 2024 in క్రైం హైదరాబాద్ New Update షేర్ చేయండి Shamshabad : అమ్మ పొత్తిళ్లలో ఆదమరిచి నిద్రిస్తున్న నెల వయసు శిశువు ఆపహరణకు (Month Old Baby Missing) గురైన సంఘటన హైదరాబాద్ (Hyderabad) శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలో చోటుచేసుకుంది. ఆర్జీఐఏ పోలీసుల (RGIA Police) కథనం ప్రకారం.. ఏపీలోని కర్నూల్‌కు చెందిన పి.చిన్నా దంపతులు దినసరి కార్మికులు. శంషాబాద్ పై వంతెన కింద నివాసం ఉంటూ ప్లాస్టిక్, కాగితాలను ఏరుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. Also Read: డాడీ..లే..డాడీ.. తండ్రి చనిపోయిన విషయం తెలియక వెక్కి వెక్కి ఏడుస్తున్న రెండేళ్ల బాలుడు..! అయితే, ఈ నెల 28వ తేదీ రాత్రి భార్య, ఐదేళ్ల లోపు ఇద్దరు కుమార్తెలు నిద్రకు ఉపక్రమించారు. వేకువజామున చూసేసరికి భార్య ఒడిలో నిద్రించిన కుమార్తె (నెల వయసు) కనిపించలేదు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. Also Read: ప్రియుడి టార్చర్.. రోడ్డుపైనే పలుసార్లు ఇలా వేధించేవాడు..! కాగా, ఇప్పటికే రాష్ట్రంలో అంతరాష్ట్రముఠా పసికందుల విక్రయం చేస్తున్న ఘటన కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలో నెల వయసు శిశువు కనిపించకుండా పోవడంతో తలిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ బిడ్డను వెతికి పెట్టాలని పోలీసులను ప్రాధేయపడుతున్నారు. #shamshabad #month-old-baby-missing #rgia-police మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి