డబ్బులిచ్చి మరీ..’డాబర్ మేన్’ అయిన జపాన్ మేన్ ..!

కుక్కని పెంచడం ప్రేమించడం వరకూ ఓకే..!జపాన్ లో ఓ వ్యక్తి ఏకంగా కుక్కలా మారిపోయాడు. అబద్ధం అనుకుంటున్నారా..నిజమండి..! విచిత్రం ఏంటంటే.. తాను కుక్కలా మారడం కోసం ఒకటి రెండూ కాదు అక్షరాలా 20 వేల డాలర్లు ఖర్చుపెట్టాడు.కుక్కలా మారిన తర్వాత పబ్లిక్ లో అతని ఫస్ట్ డాగ్ వాక్ కి నిజమైన కుక్కలు కూడా నోరెళ్లబెట్టాయి.పనిలో పని సహకుక్కలతో సావాసం కూడా మొదలెట్టాడు. కుక్కలా దొర్లడం, కుక్కలా షేక్ హ్యాండ్ ఇవ్వడం, కుక్కలా తోకాడించడం.ఇప్పుడీ శునకమానవుడి వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.జంతువుల నుంచి వేరు చేయడానికి మనిషికి సిక్స్త్ సెన్స్ ఇవ్వబడింది.పనిగట్టుకుని మనిషి కుక్కలా మారడం ఏంటి..!? అసలు డాక్టరు, ప్రభుత్వము దీన్ని ఎలా అంగీకరించారు...!? ఈ చర్య పూర్తిగా అసం బద్ధమైంది అంటూ స్పందించారు.

New Update
డబ్బులిచ్చి మరీ..’డాబర్ మేన్’ అయిన జపాన్ మేన్ ..!

పిచ్చి పలు రకాలట.. ! అంతే కాదు ఎవరి పిచ్చి వారికి ఆనందం...కూడా..! కొందరి తాగుడంటే పిచ్చి, కొందరికి తిండి పిచ్చి..ఇంకొందరికి పక్షుల పిచ్చి. మరికొందరికి కుక్కల పిచ్చి. పిచ్చి ఏదైతేనేం..! పెంచడం ప్రేమించడం వరకూ ఓకే..!

జపాన్ లో ఓ వ్యక్తి ఏకంగా కుక్కలా మారిపోయాడు. అబద్ధం అనుకుంటున్నారా..నిజమండి..! విచిత్రం ఏంటంటే.. తాను కుక్కలా మారడం కోసం ఒకటి రెండూ కాదు అక్షరాలా 20 వేల డాలర్లు ఖర్చుపెట్టాడు.

కుక్కలా మారిన తర్వాత పబ్లిక్ లో అతని ఫస్ట్ డాగ్ వాక్ కి నిజమైన కుక్కలు కూడా నోరెళ్లబెట్టాయి.పనిలో పని సహకుక్కలతో సావాసం కూడా మొదలెట్టాడు. కుక్కలా దొర్లడం, కుక్కలా షేక్ హ్యాండ్ ఇవ్వడం, కుక్కలా తోకాడించడం.

publive-image

అబ్బో ! ఒకటేమిటి నిజమైన కుక్కలు కూడా ఇంత హడావుడి చెయ్యవేమో..! ఇతగాడి కుక్కవేషం ఇక్కడితో ఆగుతుందో పెళ్లి కూడా కుక్కనే చేసుకునేదాకా వెళుతుందో తెలియని పరిస్థితి.

ఇప్పుడీ శునకమానవుడి వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. దేవుడు తనలా మనుషుల్ని సృష్టిస్తే ..ఇక్కడ డబ్బులు ఖర్చుపెట్టి మరీ మనిషి కుక్కలా మారుతున్నాడేంటో అని కొందరన్నారు.

మరికొందరైతే జంతువుల నుంచి వేరు చేయడానికి మనిషికి సిక్స్త్ సెన్స్ ఇవ్వబడింది.పనిగట్టుకుని మనిషి కుక్కలా మారడం ఏంటి..!? అసలు డాక్టరు, ప్రభుత్వము దీన్ని ఎలా అంగీకరించారు...!? ఈ చర్య పూర్తిగా అసం బద్ధమైంది.

అతని జీవితాన్ని పాడు చేసిందనిపిస్తోంది..అంటూ స్పందించారు.వాళ్లన్నారని కాదు గానీ ఎంత కుక్కలంటే ఇష్టం ఉంటే మట్టుకి శరీరాన్ని శునకంలా మార్చుకోవడం ఏంటి..? దీన్నే శునకానందం అంటారేమో..కదా.!

Advertisment
Advertisment
తాజా కథనాలు