Warangal Road Accident: ఆటోని ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయిన నలుగురు!

వరంగల్ జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరో అయిదుగురికి తీవ్ర గాయాలయ్యాయి..

New Update
Warangal Road Accident: ఆటోని ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయిన నలుగురు!

Warangal Road Accident: వరంగల్ జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరో అయిదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

కాగా,వరంగల్ నుంచి తొర్రూరు వైపు ఆటో వెళుతుండగా.. తొర్రూర్ నుండి వరంగల్ వైపు వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులు ఊరూరు తిరిగి తేనె అమ్మే వారిగా స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంలో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను 108 వాహనంలో చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

వర్థనపేట సీఐ శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే అది రాజస్థాన్ కు చెందిన లారీ కాగా, డ్రైవర్ మద్యం మత్తులో నిద్రలోకి జారుకోవడంతోనే ప్రమాదం సంభవించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కేసు నమోదు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Maoists surrender : పోలీసులకు లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్‌‌ దంతేవాడ పోలీస్ స్టేషన్‌లో 26 మంది మావోయిస్టులు సరెండరయ్యారు. వారిలో ముగ్గురిపై రివార్డ్ ఉంది. మావోయిస్టులు ఎవరైతే లొంగిపోయారో వారి వివరాలు పోలీసులు మీడియాకు వెల్లడించారు. కొన్నిరోజుల క్రితమే 70 మంది మావోయిస్టులు లొంగిపోయిన విషయం తెలిసిందే.

New Update
Maoists surrender

Maoists surrender Photograph: (Maoists surrender)

నక్సల్ టార్గెట్‌గా కేంద్ర బలగాలు మావోయిస్టుల ఏరివేతను కొనసాగిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌‌లో మరోసారి భారీగా నక్సలైట్‌లు లొంగిపోయారు. కొన్ని రోజుల క్రితమే 70 మంది మావోయిస్టులు మూకుమ్మడిగా లొంగిపోగా, తాజాగా మరో 26 మంది సరెండరయ్యారు. దంతెవాడ పోలీసుల ముందు మావోయిస్టుల లొంగుబాటు జరిగింది. లొంగిపోయిన మావోయిస్టులలో ముగ్గురిపై రూ.4 లక్షల 50వేల  రివార్డు కూడా ఉంది. మావోయిస్టులు ఎవరైతే లొంగిపోయారో వారిని దంతెవాడ పోలీసులు మీడియాకు చూపించారు. పోలీసు అధికారులు లొంగిపోయిన మావోయిస్టుల వివరాలు వెల్లడించారు.

Also read: Delhi: ఢిల్లీలో భానుడి భగభగ.. సీజన్‌లో ఆల్ టైం రికార్డు స్థాయి టెంపరేచర్

ఆపరేషన్ కగార్ పేరుతో నక్సల్స్‌ను ఏరివేస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని నెలల్లో చత్తీష్‌గడ్ దండకారణ్యం ప్రాంతంలో వందల సంఖ్యలో మావోయిస్టులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైయ్యారు. దీంతో నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు.

Also read: Varanasi gang rape: ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్స్ యువతికి మత్తుమందు ఇచ్చి.. 23 మంది గ్యాంగ్‌రేప్

అలాగే మావోయిస్టులు అజ్ఞాత వీడి సరెండరై సాధారణ జీవితం గడపాలని వరంగల్ పోలీస్ కమిషనర్ మావోయిస్టులకు పిలుపునిచ్చారు. గత ఫిబ్రవరి 21వ తారీఖున వరంగల్ పోలీస్ కమిషనర్ ఎదుట లొంగిపోయిన నిషేధిత మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యురాలు వంజం కేశే అలియాస్ జెన్నీకి ఆమె పై ప్రభుత్వం ప్రకటించిన రూ.4 లక్షల రివార్డ్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా లొంగిపోయిన మహిళ మావోయిస్టు కు అందజేశారు.

Advertisment
Advertisment
Advertisment