Visakha : 120 మందిని మోసం చేసి రూ.3 కోట్లు కొట్టేసింది!

AP: విశాఖపట్నంలోని ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో చీటిల పేరుతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. వెంకటలక్ష్మి అనే మహిళా 120 మంది నుండి లక్షలు రూపాయలు చిటీలు కట్టించుకొని టోపీ పెట్టింది. మొత్తం రూ.3 కోట్లతో పరారైంది. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

New Update
Visakha : 120 మందిని మోసం చేసి రూ.3 కోట్లు కొట్టేసింది!

Vishakhapatnam : విశాఖపట్నంలో చిటీల (Chits) పేరుతో భారీ మోసం (Fraud)  జరిగింది. ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో చీటిల పేరుతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. వెంకటలక్ష్మి అనే మహిళ రూ.3 కోట్లకు టోకరా పెట్టింది. సుమారు 120 మంది నుండి లక్షలు రూపాయలు చిటీలు కట్టించుకొని బాధితులను మోసం చేసింది. చిటీల మోసంపై 3 నెలలుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన న్యాయం జరగడం లేదంటూ బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. వెంకటలక్ష్మి ఇంటి వద్ద బాధితులు ఆందోళనకు దిగారు.

Also Read : నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త.. పరీక్షల వాయిదాపై కీలక ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Govt : ఏపీ ప్రభుత్వం కొత్త పథకం.. కుటుంబానికి రూ.20వేలు..రేపటి నుంచి అకౌంట్లోకి!

రేపు ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. 'మత్స్యకార సేవలో' అనే పేరుతో సీఎం కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిచనున్నారు. దీనికోసం ప్రభుత్వం  రూ. 258 కోట్ల మేర ఖర్చు చేయనుంది.

New Update
chandrababu srikakulam

chandrababu srikakulam

మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  సముద్రంలో వేట విరామ సమయంలో జాలర్లకు అందించే ఆర్థిక సాయం అందించనున్నారు.  ఏప్రిల్ 26వ తేదీ శనివారం రోజున సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. 'మత్స్యకార సేవలో' అనే పేరుతో సీఎం చంద్రబాబు పథకాన్ని ప్రారంభించనున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిచనున్నారు. ఈ పథకం కింద 1,29,178 కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. దీనికోసం కూటమి ప్రభుత్వం  రూ. 258 కోట్ల మేర ఖర్చు చేయనుంది. రేపు లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు.  

Advertisment
Advertisment
Advertisment