మంచి మనసు చాటుకున్న అయ్యర్.. వీడియో వైరల్

వెన్నునొప్పితో బాధపడుతున్న శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుతం టీమిండియాలో రీఎంట్రీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ(NCA)లో ఫిట్‌నెస్‌ శిక్షణ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం అయ్యర్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
మంచి మనసు చాటుకున్న అయ్యర్.. వీడియో వైరల్

నగదు సాయం చేసిన శ్రేయాస్..

టీమిండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌నెస్ సాధించే పనిలో ఉన్నాడు. కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న అయ్యర్.. ప్రస్తుతం బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ(NCA)లో పున‌రావాసం పొందుతున్నాడు. ఈ సందర్భంగా పని మీద కారులో వెళ్తున్న అయ్యర్ దగ్గరికి.. పాపతో కలిసి ఓ వ్యక్తి వచ్చి తన సమస్య చెప్పుకుని సాయం చేయమని అడిగాడు. వారిని నవ్వుతూ పలకరించిన అయ్యర్.. త‌న జేబులో నుంచి కొంత న‌గ‌దు తీసి అతడికి ఇచ్చాడు. మ‌రో వ్య‌క్తి కూడా రాగా అత‌డికి కూడా డ‌బ్బు ఇచ్చాడు. దీన్ని ఎవ‌రో వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా నెట్టింట్ట వైర‌ల్‌గా మారింది. మంచి మనసున్న వ్యక్తివి అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

జట్టులో చోటు కోసం శ్రమ.. 

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గాయపడ్డ అయ్యర్ న్యూజిలాండ్ దేశానికి వెళ్లి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఇక తాజాగా NCAలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఆసియా కప్‌లో చోటు దక్కించుకునేసదుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. రెండు రోజుల్లో జట్టుని ప్రకటించే అవకాశం ఉండడంతో ఈ మెగా టోర్నీకి ఎంపిక అవుతాడని అభిమానులు భావిస్తున్నారు. ఆసియా కప్ మొదటి మ్యాచ్ ఆగస్టు 30వ తేదీన పాకిస్తాన్, నేపాల్ జట్ల మధ్య జరగనుంది. సెప్టెంబర్ 2వ తేదీన భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఇక ప్టెంబర్ 4వ తేదీన భారత్, నేపాల్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17వ తేదీన జరగనుంది. గతసారి ఆసియా కప్‌ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహించారు. ఈసారి మాత్రం 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఆడనుంది. గ్రూప్ దశ మ్యాచ్‌ల తర్వాత సూపర్-4 మ్యాచ్‌లు సెప్టెంబర్ 6, 9, 10, 12, 14, 15వ తేదీల్లో జరుగుతాయి.

స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో లైవ్..

ఆసియా కప్ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో అభిమానులు లైవ్ చూడగలరు. ఆన్‌లైన్‌లో చూడాలంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ ప్రసారం అవుతుంది. అలాగే భారత మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని డీడీ స్పోర్ట్స్‌ ఛానెల్లో కూడా చూసి అస్వాదించవచ్చు. ఆసియా కప్ తర్వాత ప్రపంచకప్‌లో కూడా భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు