Crime News: కుమార్తె ప్రేమ వివాహం.. కత్తితో క్రూరంగా దాడి చేసిన తండ్రి..! ఏలూరు జిల్లా సీతారామపురంలో అమానుషం చోటుచేసుకుంది. కూతురు శ్రావణి ప్రేమ పెళ్లి చేసుకుందనే కోపంతో తండ్రి.. అల్లుడు వంశీపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. వంశీ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో శ్రావణి తండ్రి, ఇతర బంధువులపై కేసు నమోదు చేశారు. By Jyoshna Sappogula 11 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Father Attacked Son In law: అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఓ యువకుడిని ప్రేమించింది. పెద్దలకు తెలియడకుండా ప్రేమ పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న తండ్రి తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఆ యువకుడిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ అమానుష ఘటన ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలోని సీతారామపురం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. Also Read: ఏపీ పొత్తుల్లో కొత్త ట్విస్ట్.. చంద్రబాబు నివాసానికి రాని పురందేశ్వరి సీతారామపురానికి చెందిన కందుల వంశీ అనే యువకుడు, అత్తి శ్రావణి అనే యువతి కొన్నాళ్ల నుండి ప్రేమించుకున్నారు. అయితే, వీరిద్దరి ప్రేమకు పెద్దలు అడ్డు చెప్పడంతో ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. వెంటనే ఈ విషయం తెలుసుకున్న శ్రావణి తండ్రి.. కోపంతో తన బంధువులను వెంట వేసుకుని వంశీ ఇంటిపై దాడికి దిగాడు. వంశీపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేయగా అతను తీవ్రంగా గాయపడ్డాడు. Also Read: ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో ఎస్బీఐకి సుప్రీం కోర్టు మొట్టికాయలు.. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. వెంటనే వంశీని నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడు వంశీ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో శ్రావణి తండ్రి, ఇతర బంధువులపై కేసు నమోదు చేశారు. ఈ నెల 8న ఏలూరులో పెళ్లి చేసుకున్న శ్రావణి తన తల్లిదండ్రుల నుండి ప్రాణ హాని ఉందని భావించి పోలీసులను ఆశ్రయించింది. దాంతో ఇరు కుటుంబ సభ్యులను పిలిపించిన పోలీసులు.. వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే, శ్రావణి తండ్రి తీరు మాత్రం ఏం మారలేదు. చివరికి అల్లుడిపై దాడి చేసి.. కూతురు శ్రావణిని బలవంతంగా తీసుకెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేపట్టారు. #andhra-pradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి