ANAKAPALLE: దారుణం.. ఏపీలో డ్యాన్స్ చేస్తూ కోడి తల కొరికేసిన డ్యాన్సర్ AP: అనకాపల్లిలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ డ్యాన్సర్ నృత్య ప్రదర్శన చేస్తూ కోడిపెట్ట తలను కొరికివేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో పెటా ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. By V.J Reddy 13 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి ANAKAPALLE: అనకాపల్లిలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ డ్యాన్సర్ నృత్య ప్రదర్శన చేస్తూ కోడిపెట్ట తలను కొరికివేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో పెటా (పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్) ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. నృత్య ప్రదర్శనలో జనసందోహం ముందు ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కోడి తలను తన పళ్లతో కొరికి చంపాడని, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ పోలీసు అధికారులను పెటా ఇండియా సంప్రదించింది. ప్రేక్షకుల్లో పిల్లలు కూడా ఉన్నారని, వినోదం పేరిట ఈ వీడియోను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారని పేర్కొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ, జంతువుల పట్ల క్రూరత్వం నిరోధక చట్టం-1960లోని సంబంధిత సెక్షన్ కింద డ్యాన్సర్‌తో పాటు నిర్వాహకులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. #anakapalle సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి